Tuesday, 10 November 2020

దివి దశ తిరిగింది.. బిగ్‌బాస్ బ్యూటీకి హీరోయిన్ ఛాన్సులు!

తెలుగు బిగ్‌బాస్-4లో సందడి చేసిన దివికి మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తోంది. దసరా రోజు సమంత హోస్ట్ చేసిన ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయిన బిగ్‌బాస్ హౌస్‌ను వీడింది. ఆ సందర్భంగా దివికి సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని కోరగా హీరో కార్తికేయను సమంత కోరగా ఆయన కూడా సరేనన్నారు. చాలా సినిమాల్లో చిన్నచిన్న క్యారెక్టర్లు చేసిన దివి.. బిగ్‌బాస్‌ తర్వాత హీరోయిన్ అవకాశాలపై ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. Also Read: ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ కోసం తెరకెక్కిస్తున్న రెండు వెబ్ సిరీసుల్లో దివికి ఆఫర్లు వచ్చాయి. దీంతో పాటు మరో రెండు చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు తలుపు తట్టినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బిగ్‌బాస్‌ అవకాశం దివి కెరీర్‌కు బూస్టప్ ఇచ్చినట్లే కనిపిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pgpNos

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....