టాలీవుడ్ నటుడిగా, నిర్మాతగా సుపరిచితుడైన బండ్ల గణేష్.. రాజకీయాల్లోనూ తనదైన మాటలతో తన మార్క్ చూపించిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కప్పుకొని మాటల తూటాలు పేల్చడంతో ఈయనకు సంబంధించిన అన్ని విషయాలు వైరల్ అయ్యాయి. అయితే అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. తీరా రిజల్ట్ చూస్తే సీన్ రివర్స్ అయింది. దీంతో ఆయన కూడా యూ టర్న్ తీసుకొని రాజకీయాలకు, పొలిటికల్ కామెంట్లకు దూరంగా ఉంటున్నాడు. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ.. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో వీటిపై రియాక్ట్ అవుతూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు బండ్ల గణేష్. ''నాకు ఏ రాజకీయ పార్టీతో, అలాగే ఏ రాజకీయాలతో సంబంధం లేదు. నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా. దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన.. మీ బండ్ల గణేష్'' అని పేర్కొంటూ ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ రకంగా మరోసారి తన రాజకీయ జీవితంపై క్లారిటీ ఇస్తూ గత విషయాలను ఇప్పుడు తవ్వొద్దు అని చెప్పాడు. Also Read: నటుడిగా తెలుగు ప్రేక్షకుల మదిలో చిలిచిపోయిన బండ్ల గణేష్.. నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన నిర్మించిన 'గబ్బర్ సింగ్' ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత రాజకీయ గడపతొక్కితే అది బెడిసికొట్టడంతో తిరిగి సినీ ఇండస్ట్రీనే నమ్ముకున్నాడు బండ్ల గణేష్. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో వెండితెరపై అలరించిన ఆయన, కొద్దిరోజుల క్రితమే కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2J3jTXB
No comments:
Post a Comment