Sunday, 22 November 2020

Samantha: మాల్దీవ్ బీచుల్లో సమంత ఎంజాయ్! ఆశ్చర్యపోయిన అక్కినేని వారసుడు.. ఆ రియాక్షన్ చూస్తే..

సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన, తన ఫ్యామిలీ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ ఉండే .. తాజాగా మాల్దీవ్ బీచుల్లో సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. భర్త నాగచైతన్యతో కలిసి విదేశాలు చుట్టి రావడమంటే సమంతకు మహా ఇష్టం అనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నాగచైతన్య పుట్టిన రోజును సెలబ్రేట్ చేసేందుకు ఆయనతో పాటు మాల్దీవ్ వెళ్లింది సమంత. అక్కడి బీచ్, అందమైన ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది ఈ జోడీ. ఈ రోజు (నవంబర్ 23) అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా మాల్దీవ్ ట్రిప్ వేసిన సమంత.. భర్తతో జాలీగా గడుపుతూ రిలాక్స్ అవుతోంది. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలను సామ్ తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. మాల్దీవుల్లోని ఉత్తరాదిన ఉన్న ఓ ద్వీపంలో ఈ అక్కినేని దంపతులు ఉన్నట్లు సమాచారం. అయితే అక్కడ స్కూబా డైవింగ్‌ చేస్తూ దిగిన ఓ పిక్ షేర్ చేసిన సమంత.. ''మొత్తానికి సాధించా, సముద్రంలో డైవ్ చేశా..'' అంటూ ఎక్సయిట్ అయింది. ఇది చూసిన అక్కినేని అఖిల్.. ''వావ్.. ఆశ్చర్యంగా ఉంది. నేను నమ్మలేకపోతున్నా'' అని కామెంట్ పెట్టడం అక్కినేని అభిమానులను ఆకట్టుకుంటోంది. Also Read: సామ్ కెరీర్ విషయానికొస్తే.. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా, అక్కినేని కోడలిగా వెండితెరపై సత్తా చాటుతున్న ఆమె చివరగా 'జాను' సినిమాలో మెరిసింది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఆహా వేదికపై ప్రసారమవుతున్న 'సామ్ జామ్' ప్రోగ్రాంని హోస్ట్ చేస్తోంది. ఇక ఆమె తదుపరి సినిమా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందనుందని, ఇందులో తన భర్త నాగ చైతన్యతో సామ్ మరోసారి తెరపంచుకోనుందని తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35V2R6t

No comments:

Post a Comment

'When I Got The Paatal Lok Demo...'

'...it was for a very, very big lead actor.' from rediff Top Interviews https://ift.tt/hlYgKLd