Sunday, 22 November 2020

పుట్టినప్పటి నుంచే బీపీ.. మెదడులో నరాలు చిట్లిపోతాయి అన్నారు: ఆరోగ్య సమస్యపై తొలిసారి స్పందించిన రానా

హీరో ఆరోగ్యంపై అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. రానాకు కిడ్నీ సమస్య వచ్చిందని, వైద్యం నిమిత్తం ఆయన అమెరికా వెళ్లారని అన్నారు. అంతేకాదు, రానా తల్లి లక్ష్మి ఆయనకు ఒక కిడ్నీని దానం చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఆ మధ్య రానా బాగా సన్నబడటంతో ఈ వార్తలు నిజమే అని చాలా మంది అనుకున్నారు. కానీ, ఈ వార్తలపై రానా ఒక్కసారి కూడా స్పందించలేదు. దీనికి తోడు ఈ వార్తలు ప్రచారంలో ఉన్న సమయంలో ‘అరణ్య’ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమా కోసం రానా బరువు తగ్గి ఉంటారని.. అప్పటి వరకు వచ్చిన వార్తల్లో నిజం లేదని కూడా చాలా మంది అనుకున్నారు. కానీ, రానాకు నిజంగానే కిడ్నీ సమస్య వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. హోస్ట్ చేస్తున్న ‘సామ్ జామ్’ టాక్ షోలో పాల్గొన్న రానా దగ్గుబాటి.. తన ఆరోగ్య సమస్యలపై స్పందించారు. ‘సామ్ జామ్’ ఎపిసోడ్ 2 నవంబర్ 27న ‘ఆహా’లో అందుబాటులోకి రానుంది. ఈ ఎపిసోడ్‌లో రానా దగ్గుబాటి, దర్శకుడు నాగ్ అశ్విన్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమోను ఆదివారం విడుదల చేశారు. ఈ ప్రోమోలో రానా ఆరోగ్య సమస్యలపై స్పందించిన క్లిప్స్ వేశారు. Also Read: ‘‘జీవితం వేగంగా ముందుకు వెళ్తోన్న సమయంలో అకస్మాత్తుగా ఒక చిన్న పాజ్ బటన్ వస్తుంది. పుట్టినప్పటి నుంచే బీపీ ఉంది. దీని వల్ల గుండెకు సమస్య తలెత్తుంది.. నీ కిడ్నీలు కూడా పాడవుతాయి అని చెప్పారు. స్ట్రోక్ హెమరేజ్‌ (మెదడులో నరాలు చిట్లిపోవడం)కు 70 శాతం, చనిపోవడానికి 30 శాతం ఛాన్స్ ఉందని చెప్పారు’’ అని ప్రోమోలో రానా చెప్పారు. దీనికి సమంత స్పందిస్తూ రానా ఆరోగ్య సమస్యపై జనాలు రకరకాలుగా మాట్లాడినా ఆయన మాత్రం ధైర్యంగా నిలబడ్డారని అన్నారు. ఆ సమయంలో రానాను తాను స్వయంగా చూశానని.. అందుకే ఆయన తనకు సూపర్ హీరో అని చెప్పారు. ఈ సమయంలో అక్కడున్నవారంతా భావోద్వేగానికి గురయ్యారు. అయితే, తన ఆరోగ్య సమస్యపై రానా ఏం మాట్లాడారో పూర్తిగా తెలియాలంటే నవంబర్ 27 వరకు ఆగాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UMr5JY

No comments:

Post a Comment

Why Ram Gopal Varma Was Ashamed After Watching Satya

'I've never seen Ramuji cry... even when his father passed away.' from rediff Top Interviews https://ift.tt/L26Zkwj