Monday 9 November 2020

BB3 క్రేజీ అప్‌డేట్.. ఎట్టకేలకు బాలయ్య హీరోయిన్ ఫిక్స్.. ఆతృతగా ఉందంటున్న అందాల తార

మాస్ డైరెక్టర్ , నందమూరి నటసింహం కాంబోలో తెరకెక్కుతున్న భారీ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో బాలయ్య సరసన నటించబోతున్న హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. గత కొన్ని నెలలుగా బోయపాటి శ్రీను- బాలయ్య కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గురించి చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ ట్వీట్‌తో ఆ చర్చలకు ఫుల్‌స్టాప్ పడింది. బీబీ 3లో తానే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేస్తూ ట్వీట్ చేసింది సాయేషా. లాక్‌డౌన్ ముందే షూటింగ్ ప్రారంభించిన BB 3 యూనిట్.. కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా షూటింగ్ వాయిదా వేసుకుంది. ఇటీవలే షూటింగ్స్ రీ ఓపెన్‌ కావడంతో తిరిగి సెట్స్ పైకి వచ్చేశారు. అయితే ఈ మూవీలో బాలయ్య సరసన నటించబోయే హీరోయిన్ విషయమై ఎంతోమందిని పరిశీలించిన దర్శకనిర్మాతలు చివరకు మలయాళ భామ ప్రయాగ మార్టిన్‌ని ఫైనల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ చివరి క్షణంలో కొన్ని కారణాల వల్ల ఆమెను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించినట్లు తెలిసింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ మరోసారి కన్ఫ్యూజన్‌లో పడిపోయారు. Also Read: ఈ నేపథ్యంలో తాజాగా కన్ఫ్యూజన్‌కి తెరదించుతూ తాను BB 3లో భాగం కానున్నట్లు తెలిపింది సాయేషా. ఈ భారీ ప్రాజెక్టులో అవకాశం దక్కడం గౌరవంగా ఫీల్ అవుతున్నానని, అతి త్వరలో షూటింగ్‌లో పాల్గొనబోతున్నానని పేర్కొంటూ చాలా ఆతృతగా ఉందని తెలిపింది సాయేషా. కాగా కథ పరంగా ఈ సినిమాలో మరో హీరోయిన్‌కి కూడా ఛాన్స్ ఉందనే సమాచారాలు వస్తున్నప్పటికీ దీనిపై యూనిట్ నుంచి క్లారిటీ రాలేదు. గతంలో ''సింహ, లెజెండ్'' సినిమాలతో భారీ హిట్స్ రాబట్టి BB3 రూపంలో హాట్రిక్ దిశగా అడుగులు వేస్తోంది బోయపాటి- బాలకృష్ణ కాంబో. ఇప్పటికే విడుదలైన BB 3 ఫస్ట్ రోర్‌ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ సినిమాకు ‘టార్చ్‌బేరర్’ అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారననే టాక్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమాకు మిర్యాల రవీంద్రనాథ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండగా థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36oJzW2

No comments:

Post a Comment

'They Can Easily Arrest You'

'The work of a film-maker is going out and making films.' from rediff Top Interviews https://ift.tt/TdM2ew6