Saturday, 7 November 2020

Allari Naresh: సమంతను అలా చూసి..! అక్కినేని కోడలు పిల్ల‌పై అల్లరి నరేష్ కామెంట్స్

ఇటీవలే అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ హోస్ట్ అవతారమెత్తి దుమ్ముదులిపిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ రూపంలో మొదటిసారి ఓ రియాలిటీ షోకి హోస్ట్‌గా చేసిన సమంత విమర్శకుల ప్రశంసలందుకోవడమే గాక, భారీ టీఆర్పీ రాబట్టి ఆశ్చర్య పర్చింది. మామ నాగార్జునకు ఏ మాత్రం తీసిపోనని ఒక్క ఎపిసోడ్ తోనే నిరూపించింది సామ్. దీంతో ఎక్కడ చూసినా సమంత హోస్టింగ్ గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో అల్లరి నరేష్‌ కూడా సమంత యాంకరింగ్ గురించి స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రధాన పాత్రలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతోన్న 'నాంది' మూవీ టీజర్ నిన్న (నవంబర్ 6) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ విడుదల అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లరి నరేష్.. తన కెరీర్‌లో ఇదే బెస్ట్ మూవీ అవుతుందని, సినిమాలో తన క్యారెక్టర్ చూసి తనకోసం అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారని చెప్పారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ షో గురించి స్పందించిన ఆయన.. తనతో కలిసి నటించిన హీరోయిన్స్ బిగ్ బాస్‌లో హల్చల్ చేస్తుండటం ఆనందంగా ఉందని అన్నారు. Also Read: నాగార్జున అంటే తనకు చిన్నప్పటి నుంచే ఎంతో ఇష్టమని.. ఆయన సినిమాలు గానీ, రియాలిటీ షోస్ గానీ ఏ ఒక్కటీ మిస్ కానని చెప్పారు అల్లరి నరేష్. ఇక దసరా స్పెషల్ ఎపిసోడ్‌ని సమంత చాలా బాగా హోస్ట్ చేసిందని చెప్పిన నరేష్.. ఓ రియాలిటీ షోకి హోస్ట్ చేయడం అంత సులువు కాదని, అయినప్పటికీ సమంత అద్భుతమైన పర్‌ఫార్‌మెన్స్ కనబర్చిందని పేర్కొన్నారు. ఇక అల్లరోడి నాంది సినిమా విషయానికొస్తే.. ఎస్వీ2 ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఓ సన్నివేశంలో అల్లరి నరేష్ నగ్నంగా నటించడం సంచలనంగా మారింది. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ప్రియదర్శి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, నవమి, శ్రీకాంత్ అయ్యంగార్, వినయ్ వర్మ, దేవి ప్రసాద్, ప్రమోధిని, మణిచందన ముఖ్య పాత్రలు పోషించారు. ‌


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2IelTMb

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....