Sunday, 25 October 2020

Nani: శ్యామ్ సింగరాయ్ లేటెస్ట్ అప్‌డేట్.. డౌటే లేదు.. అనుమానాలకు తెర దించుతూ ముహూర్తం ఫిక్స్

టాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకున్న నాచురల్ స్టార్ వరుస సినిమాలను లైన్‌లో పెట్టేశారు. జయాపజయాలతో సంబంధం లేకుండా విలక్షణ కథలను ఎంచుకుంటున్న ఆయన ఇటీవలే V సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి ప్రస్తుతం 'టక్ జగదీష్' చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ మూవీ షూటింగ్ ఫినిష్ కాగానే తన తదుపరి సినిమా '' స్టార్ట్ చేయబోతున్నారు నాని. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ తాలూకు వివరాలు తెలుపుతూ అధికారిక ప్రకటన చేసింది చిత్రయూనిట్. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో పీరియాడికల్ ఫిక్షన్ కథతో ఈ 'శ్యామ్ సింగరాయ్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాని జంటగా సాయి పల్లవి, క్రితి శెట్టి హీరోయిన్లుగా నటించనున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్స్ సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి. గతంలో ఏ సినిమాలో కనిపించని డిఫరెంట్ రోల్ పోషించనున్నారట నాని. తాజాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ గురించిన అప్‌డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభించి అతి త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని ప్రకటించారు. Also Read: ఇకపోతే ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ స్వీకరించింది. ఈ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఈ మూవీ రూపొందనుంది. వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా నిర్మించనున్నారు. మెలోడీ మ్యాజిక్ చేసే మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HzUZxu

No comments:

Post a Comment

'Never Be Another Zakir Hussain'

'Zakir <em>bhai</em> always said, '<em>koi chala nahi jata hai</em>', he believed even after death, you ...