మహానటి సినిమాతో తనలోని నటనా ప్రతిభను చాటిచెప్పడమే గాక నేషనల్ అవార్డు గెలుచుకున్న మరోసారి ఛాలెంజింగ్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కథలు ఎంపిక చేసుకోవడంలో ఆచితూచి అడుగులేస్తున్న ఆమె 'మిస్ ఇండియా'గా అలరించేందుకు రెడీ అయింది. కొత్త దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ రీలీజ్ చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. 2 నిమిషాల 18 సెకనుల నిడివితో కూడిన ఈ ట్రైలర్‌లో కీర్తి సురేష్ నటన అబ్బుర పరుస్తోంది. సినిమా కథా నేపథ్యం, కీర్తి రోల్ చూస్తుంటే ఈ సినిమాతో ఆమె ఖాతాలో మరో సాలీడ్ హిట్ పడ్డట్లే అనిపిస్తోంది. గొప్ప బిజినెస్ మ్యాన్ కావాలనే సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి విదేశాల్లో వ్యాపారం చేసి ఎలా గెలిచిందనే ప్రేరణాత్మక కథాంశంతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని స్పష్టమవుతోంది. ఇండియన్ చాయ్ టేస్ట్, ఆ చాయ్‌కి ఉన్న క్రేజ్ ఏంటనేది విదేశాల్లో చాటిచెబుతూ తాను కన్న కలలను నిజం చేసుకున్న అమ్మాయిగా కీర్తి నటిస్తోంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్‌లో మోటివేషనల్ డైలాగ్స్ యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. Also Read: ఇక ఈ 'మిస్ ఇండియా' సినిమాలో కీర్తికి తల్లిగా నదియా, తండ్రిగా సీనియర్ యాక్టర్ నరేష్, అన్నగా కమల్ కామరాజు నటించారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేకపాత్రలో కనిపించనున్నారు. చిత్రంలో నవీన్ చంద్ర, జగపతిబాబు రోల్స్ కీలకం అని తెలుస్తోంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మాణంలో వస్తోన్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో వచ్చే నవంబర్ 4న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dVrd2h
No comments:
Post a Comment