Saturday, 3 October 2020

ఒక్కడు కాదు ఇద్దరు.. మహేష్ బాబు డబుల్ ధమాకా.. దద్దరిల్లిపోతుందంటున్న సూపర్ స్టార్

కేవలం సినిమాలతోనే గాక ఇతర మార్గాల్లోనూ ఆదాయాన్ని అన్వేషిస్తుంటారు సూపర్ స్టార్ . పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడంతో పాటు సినిమా నిర్మాణాల్లో భాగమవుతుండటం చూస్తున్నాం. మరోవైపు జీఎంబీ సినిమాస్ పేరుతో భారీ ముల్టీప్లెక్స్ థియేటర్ ఓపెన్ చేసిన ఆయన.. ఈ లాక్‌డౌన్ విరామ సమయంలో ఓ యాడ్ షూట్ చేశారు. కరోనా కారణంగా గత ఆరు నెలలుగా ఇంటికే పరిమితమైన మహేష్ ఈ యాడ్ షూట్‌తో డబుల్ ధమాకా ట్రీట్ ఇచ్చారు. తాజాగా విడుదలైన ఈ యాడ్‌‌లో మహేష్ బాబు వేషం అదుర్స్ అనిపిస్తోంది. ఇందులో అన్నదమ్ములుగా రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించిన ఆయన.. తన సొంత వాయిస్‌తో ఆకట్టుకున్నారు. ఓ లుక్‌లో చాలా యంగ్‌గా, మరో లుక్‌లో పంచకట్టి మెలితిరిగిన మీసంతో జబర్దస్త్‌గా కనిపించారు. ఓ ఆన్‌లైన్ ఉత్పత్తుల సేల్ కంపెనీ కోసం చేసిన ఈ యాడ్‌లో.. ఇక దద్దరిల్లిపోవాల్సిందే అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఎన్నడూ లేనివిధంగా మెలితిగిన మీసంతో మహేష్ కనిపించడంతో ఈ లుక్ వైరల్ అవుతోంది. Also Read: మహేష్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో సక్సెస్ అందుకున్న ఆయన, ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్టు 'సర్కారు వారి పాట' కోసం ప్రిపేర్ అవుతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ అతిత్వరలో సెట్స్ మీదకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాకు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్‌ని హీరోయిన్‌గా కన్ఫర్మ్ చేసినట్లు తెలిసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cSBcoA

No comments:

Post a Comment

'Film Industry Doesn't Like New Things'

'When you try to do something that's not been tried before, nobody likes that.' from rediff Top Interviews https://ift.tt/NIhY...