Saturday, 3 October 2020

ఆ మాత్రం దానికే క్రిమినల్‌గా చూస్తారా? చాలా బాధేస్తోంది.. హాట్ యాంకర్ ఆవేదన

డ్రగ్స్ కుంభకోణం కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. ఎప్పడు ఎవరి పేరు బయటికి వస్తుందోనని శాండల్‌వుడ్ సెలబ్రెటీలు వణికిపోతున్నారు. ఇప్పటికే హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదితో పాటు పలువురిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరికొందరిని విచారించేందుకు నోటీసులు కూడా పంపారు. ఈ క్రమంలోనే ప్రముఖ పేరు కూడా బయటికి వచ్చింది. డ్రగ్స్ రవాణా కేసులో డ్యాన్సర్ కిశోర్ శెట్టిని మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా యాంకర్ అనుశ్రీ పలు పార్టీల్లో డ్రగ్స్ సేవించినట్లు అతడు పోలీసులకు చెప్పాడు. దీంతో సీసీబీ పోలీసులు అనుశ్రీకి నోటీసులు జారీచేశారు. ఈ కేసులో తన పేరు రావడంతో కంగుతిన్న అనుశ్రీ.. విచారణ ఎదుర్కొన్నంత మాత్రాన డ్రగ్స్ కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు కాదని తెలిపారు. Also Read: సంబంధం లేని కేసులో తనను అందరూ నేరస్తురాలిగా చూస్తుండటం బాధ కలిగిస్తోందని తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. విచారణలో భాగంగా తనకు తెలిసిన సమాచారాన్ని పోలీసులకు చెప్పానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని అనుశ్రీ చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Sp1XrA

No comments:

Post a Comment

'Why Would Govt Be Scared Of Cartoonists?'

'Journalists must ask the Mumbai police why are they sending notices via X to cartoonists.' from rediff Top Interviews https://ift...