తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు మొదలయ్యాయి. తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ పండుగ చివరి అంకం రానే వచ్చింది. ఇవాళ బతుకమ్మ పండుగలో చివరి రోజైన సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. 9 రోజుల పాటూ ఈ వేడుకలు జరుగనున్నాయి. ఇప్పటికే రకరకాల పూలు సేకరించిన మహిళలు.. ఇప్పుడు బతుకమ్మలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. తెలంగాణ ఆడ పడుచులు అందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు పలువురు ప్రముఖులు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు ఎమ్మెల్సీ కవిత. తాజాగా మెగాస్టార్ తెలంగాణ ఆడ పడుచులకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పారు. Read More: ‘బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను' అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఇటీవలే సోషల్ మీడియాలోకి వచ్చిన చిరంజీవి ప్రతీ అంశంపై స్పందిస్తూనే ఉన్నారు.ప్రతీ పండగకు కూడా తన అభిమానులకు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35wJPBV
No comments:
Post a Comment