Friday, 23 October 2020

నాకు దానిపై ఇంట్రస్ట్ లేదు.. సెకండ్ ఇన్నింగ్స్ ఎంజాయ్ చేస్తున్నా: జగపతిబాబు

హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్‌‌ను ఆకట్టుకున్న ఆ తర్వాత రూటు మార్చి విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన సంగతి తెలిసిందే. హీరోగా ఛాన్సులు తగ్గిన సమయంలో బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘లెజెండ్‌’లో విలన్‌గా వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా దక్కించుకున్నారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లోనూ ఛాన్సులు దక్కించుకుంటున్నారు. జగపతిబాబు హీరోగా సినిమాలు చేసిన టైమ్‌లో కంటే విలన్‌గా మారిన తరువాతే ఎక్కువ సంపాదిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దీనిపై స్పందించిన ఆయన.. సినిమాల్లో తన క్యారెక్టర్ చూసి భారీ రెమ్యునరేషన్లు ఇస్తున్నారని అందరూ అనుకుంటున్నారని... కానీ తనకు ఇప్పటికీ ఫిక్స్‌డ్ ఇవ్వడం లేదని చెప్పారు. సినిమా ఇండస్ట్రీ, సబ్జెక్ట్, సినిమా బడ్జెట్‌ని బట్టి తనరెమ్యునరేషన్ కూడా మారిపోతుందని తెలిపారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నానని, డబ్బు గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన తర్వాత చాలా ఎక్స్‌పోజర్ వచ్చిందని, చాలా పరిశ్రమలు చూడగలుగుతున్నాని జగపతిబాబు తెలిపారు. కొత్తకొత్త పాత్రల్లో నటించడం, ఇతర భాషల నటులతో పరిచయాలతో తనకు బాగా నచ్చుతోందన్నారు. అందువల్లే తాను డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా పాత్ర నచ్చితే ఓకే చెప్పేస్తున్నానని తెలిపారు. ఇటీవలే ఓ సినిమాలో ఫ్రీగా నటించేందుకు కూడా రెడీ అయ్యానని, అయితే ఏవో కారణాలతో ఆ సినిమా ఆగిపోయిందని వెల్లడించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mhLli9

No comments:

Post a Comment

'It Has Been A Box Of Surprises'

'My journey has just been so different. Each character has been so different.' from rediff Top Interviews https://ift.tt/wluedtB