గత కొంతకాలంగా పరాజయాలతో సతమతమవుతున్న .. భారీ స్కామ్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి థ్రిల్ చేయబోతున్నారు. '' పేరుతో విలక్షణ కథను రూపొందిస్తున్నారు. ఈ మూవీలో తానే హీరోగా నటిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు మంచు విష్ణు. చరిత్రలో అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ మిస్టరీని కథాంశంగా తీసుకొని హాలీవుడ్-ఇండియన్ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్స్ మోసగాళ్లపై అంచనాలు నెలకొల్పగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేసి ఆ అంచనాలకు రెక్కలు కట్టింది చిత్రయూనిట్. నేడు (అక్టోబర్ 3) కొద్దిసేపటి క్రితం చేతుల మీదుగా 'మోసగాళ్లు' టీజర్ రిలీజ్ చేశారు. ఈ మేరకు ఈ టీజర్‌ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన బన్నీ.. మంచు విష్ణు తన చిన్ననాటి స్నేహితుడని తెలుపుతూ చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇకపోతే కేవలం 31 సెకనుల నిడివితోనే విడుదలైన ఈ టీజర్ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఉపన్యాసంతో మొదలుపెట్టి.. గోడౌన్‌లో బస్తాలకొద్ది కరెన్సీ నోట్లు చూపిస్తూ భారీ స్కామ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఈ టీజర్ ద్వారా చెప్పారు మేకర్స్. Also Read: ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగాన్ని అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరిపారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన చివరిదశ పనులు జరుగుతున్నాయి. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు విష్ణు పోషిస్తున్న క్యారెక్టర్ చాలా ఇన్టెన్స్‌గా, మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఆయన సరసన కాజల్ చిత్రాన్ని మలుపుతిప్పే రోల్ పోషించిందని టాక్. చిత్రంలో నవదీప్, నవీన్ చంద్ర, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34jQA9V
No comments:
Post a Comment