Sunday, 13 September 2020

Suma: రాజా! ఎప్పటికీ ఎప్ప‌టికీ నువ్వే నా జీవితం.. రూమర్లకు చెక్ పెడుతూ సుమ ఎమోషనల్ కామెంట్స్

బుల్లితెర మాటల మాంత్రికురాలు యాంకర్ సుమ. ఆమె స్టేజ్ ఎక్కిందంటే చాలు మాటల తూటాలు అలా అలా పేలిపోతుంటాయి. వ్యాఖ్యాతగా తనకెవ్వరూ సాటిలేరని నిరూపించుకున్న ఆమె ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి ఆడియన్స్ మదిలో చెరగని ముద్రవేసింది. స్టార్ హీరోయిన్ల స్థాయిలో క్రేజ్ కొట్టేసి తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది. సిచ్యువేషన్ క్యాచ్ చేస్తూ పంచ్ డైలాగ్స్ విసరడం ఆమె ప్రధానాస్త్రం. ఎలాంటి గొప్ప ఆర్టిస్ట్ అయినా సరే వేసే పంచులకు పరేషాన్ కావాల్సిందే. ఇదిలా ఉంటే సుమ ఇంట్లో విబేధాలు వచ్చాయని, రాజీవ్ కనకాలతో సుమ రిలేషన్ షిప్ కట్ చేసుకుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జోడీలో సఖ్యత లోపించి మనస్పర్థలు వచ్చాయని పెద్ద ఎత్తున రూమర్స్ షికారు చేశాయి. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఓ ప్రోగ్రాం ద్వారా రాజీవ్‌తో ఉన్న అనుబంధాన్ని తెలుపుతూ అలాంటి రూమర్స్‌కి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేసిన సుమ.. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో భర్త రాజీవ్ కనకాలపై ఉన్న ప్రేమను వ్యక్తంచేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. Also Read: భర్త రాజీవ్ కనకాలను ఆప్యాయంగా హత్తుకున్న పిక్ ఫోటో షేర్ చేస్తూ ''రాజా! ఎప్పటికీ ఎప్ప‌టికీ నువ్వే నా జీవితం.. నువ్వే నా సర్వస్వం'' అని భావోద్వేగ పూరిత కామెంట్ చేసింది సుమ కనకాల. దీంతో ఈ పోస్ట్ చేసిన నెటిజన్స్.. ''బ్యూటిఫుల్ కపుల్, ఎవర్‌గ్రీన్ జోడీ, నైస్ కపుల్, బ్యూటిఫుల్ మూమెంట్'' అంటూ రియాక్ట్ అవుతున్నారు. ఇకపోతే ఇటీవలే సుమ దంపతులు ఓ ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అత్యంత విలాసవంతంగా ఉండే ఈ ఇంటి కోసం కొన్ని కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 10, 1999లో సుమ- వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అప్పటినుంచి వీరిద్దరూ అన్యూన్య దాంపత్య జీవితం కొనసాగిస్తూ కెరీర్ పరంగా బిజీ బిజీగా గడుపుతున్నారు. యాంకర్‌గా సుమ, యాక్టర్‌గా రాజీవ్ కనకాల ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. తాను సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తుండటం వెనుక రాజీవ్ సపోర్ట్ ఉందని ఎన్నో సందర్భాల్లో తెలిపింది సుమ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33leTDO

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....