Wednesday, 16 September 2020

Sri Reddy: హోటళ్లలో హీరోయిన్లతో టాప్ సెలబ్రిటీల తతంగం.. రకుల్‌పై ప్రెషర్ తెస్తే! శ్రీ రెడ్డి సెన్సేషన్

సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న చీకటి బాగోతాలపై కాస్టింగ్ కౌచ్ అంటూ పెద్ద ఉద్యమం చేసిన .. మరోసారి రెచ్చిపోయింది. కాస్టింగ్ కౌచ్ ఇష్యూతో ఇండస్ట్రీని వణికించి చివరకు హైదరాబాద్ వదిలి చెన్నైలో మకాం పెట్టిన ఈమె అవకాశం దొరికినప్పుడల్లా బడా దర్శకనిర్మాతలపై, టాప్ సెలబ్రిటీలపై విరుచుకుపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే లేటెస్ట్ ఇష్యూ డ్రగ్స్ విషయమై స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేసింది శ్రీ రెడ్డి. తనకు సెక్యూరిటీ కల్పిస్తే ఎంతోమంది సీక్రెట్స్ బయటపెడతానని, హోటళ్లలో జరుగుతున్న తంతంగాలను పూస గుచ్చినట్లు చెబుతానని అంటోంది. ''నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్స్ అందరికీ నమస్కారం. టాలీవుడ్‌లో ఉన్న మాఫియా, అకృత్యాలు, అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి ఎలా మోసాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని మీకు తెలియజేయాలనుకొంటున్నాను. గతంలో కూడా నేను డ్రగ్స్ విషయంలో మాట్లాడాను. టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల గురించి ఓపెన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చాను. మూవీ ఇండస్ట్రీ కేవలం నలుగురు వ్యక్తుల చేతుల్లో మాత్రమే ఉంది. Also Read: కొందరు బడా దర్శకనిర్మాతలు చిన్న చిన్న హీరోలను తొక్కేస్తూ.. అలాగే అమ్మాయిలను సెక్స్ కోసం మాత్రమే వాడుకుంటూ వాళ్లకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నారని నేను గతంలోనే చెప్పాను. అప్పుడే నేను డ్రగ్స్ గురించి కూడా మాట్లాడాను. నాకు తెలిసిన చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు రేవ్ పార్టీలు నిర్వహిస్తూ విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకుంటున్నారు. టాలీవుడ్‌లో రేవ్ పార్టీలు కామన్. ఇప్పుడు నేను డ్రగ్స్ వాడే వారి పేర్లు బయటపెడితే రచ్చ రచ్చ అవుతుంది. టాలీవుడ్ గురించి మాత్రమే నాకు తెలుసు. తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే నేను అన్నీ బయటపెడతా. పెద్ద పెద్ద హోటళ్లలో పార్టీలు పెట్టి అమ్మాయిలకు బలవంతంగా డ్రగ్స్ ఇవ్వడం, ఆ తర్వాత ఆ అమ్మాయిలతో తమ సెక్స్ కోరిక తీర్చుకోవడం జరుగుతోందని అప్పుడే చెప్పాను. నార్కోటిక్ సభ్యులకు నేను చెప్పేది ఒక్కటే.. మీరు లాంటి హీరోయిన్స్ మీద గట్టిగా ప్రెషర్ పెడితే టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల పేర్లు బయటకొస్తాయి. బిగ్ బాస్‌ల లాగా చలామణి అవుతున్న అందరి బండారం బయటపడుతుంది. నా లాంటి చాలామంది అమ్మాయిల జీవితాలు వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోయాయి'' అంటూ ఆవేదన వెళ్లగక్కింది శ్రీ రెడ్డి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3iFmgfA

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....