Monday, 7 September 2020

శర్వానంద్‌తో RX 100 డైరెక్టర్ సినిమా.. ఎట్టకేలకు ప్రకటన!

దర్శకుడు అజయ్ భూపతి తన తొలి చిత్రం ‘’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అజయ్ భూపతి నెక్ట్స్ మూవీ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అజయ్ భూపతి వద్ద ‘మహాసముద్రం’ అనే స్క్రిప్ట్ ఉందని.. ఆయన ఈ కథను పలువురు హీరోలకు చెబుతున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఆయన కథ చెప్పిన ఏ హీరో సినిమా చేయడానికి అంగీకారం తెలపలేదని వినికిడి. ఎట్టకేలకు ఒక హీరో ముందుకొచ్చారు. ఆయనే టాలెంటెడ్ యాక్టర్ . శ‌ర్వానంద్ హీ‌రోగా, అజ‌య్ భూప‌తి ద‌ర్శక‌త్వంలో ‘మహాసముద్రం’ సినిమాను ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ సోమవారం ప్రకటించింది. ‘ప్రస్థానం’, ‘గ‌మ్యం’ చిత్రాల త‌ర్వాత శ‌ర్వానంద్ చిర‌కాలం గుర్తుండిపోయే ఉద్వేగ‌భ‌రిత‌మైన‌, బ‌ల‌మైన పాత్రను చేసేందుకు సిద్ధమ‌వుతున్నారు. ఇందులో ఛాలెంజింగ్ రోల్‌ను చేయ‌బోతున్నందుకు శ‌ర్వానంద్ అమితోత్సాహంతో ఉన్నారు. సూప‌ర్‌ స్టార్ మ‌హేష్‌బాబుతో ‘స‌రిలేరు నీకెవ్వరు’ లాంటి భారీ బ్లాక్‌ బ‌స్టర్‌ను నిర్మించిన ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఇప్పుడు ‘మ‌హాస‌ముద్రం’ వంటి వైవిధ్యమైన చిత్రాన్ని నిర్మిస్తోంది. తొలి చిత్రం ‘RX 100’తో ప్రేక్షకుల‌ను ఆశ్చర్యప‌రిచిన అజ‌య్ భూప‌తి.. మ‌రోసారి ఆడియెన్స్‌ను అబ్బుర‌పరిచే ప‌వ‌ర్‌ఫుల్ స్క్రిప్టును ఈ సినిమా కోసం రెడీ చేశారు. ఇంటెన్స్ ల‌వ్‌-యాక్షన్ డ్రామాగా త‌యార‌య్యే ఈ చిత్రాన్ని సుంక‌ర రామ‌బ్రహ్మం తెలుగు, త‌మిళ ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రతి వారం ఒక అప్‌డేట్ రానుంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3h8igTr

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....