Monday, 21 September 2020

Naresh: మీ విలువలు ఎక్కడ పోయాయి.. ఇంత మానసిక క్షోభనా? రగిలిపోయిన నరేష్.. షాకింగ్ కామెంట్స్

కరోనా కల్లోలం సృష్టిస్తున్న ఈ పరిస్థితుల్లో ఆన్‌లైన్ క్లాసుల పేరిట భారీగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను పీడిస్తున్నారంటూ టాలీవుడ్ నటుడు శివబాలాజీ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్ లోని మణికొండలో ఉన్న మౌంట్‌ లిటేరా జీ స్కూల్ యాజమాన్యం తీరుపై మండిపడుతూ ఏకంగా మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు శివబాలాజీ. తాజాగా ఈ ఇష్యూపై స్పందించిన యాక్టర్ .. శివ బాలాజీకి, ఆయన సతీమణి మధుమితకు మద్దతు తెలిపారు. ఈ మేరకు స్కూల్ యాజమాన్యంపై ఫైర్ అవుతూ వీడియో రిలీజ్ చేశారు. విద్య, వైద్యం అనేవి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు.. ప్రతి పౌరుడికీ ఇవి దక్కాలంటూ మౌంట్‌ లిటేరా జీ స్కూల్ యాజమాన్యం తీరుపై ఫైర్ అయ్యారు నరేష్. సదరు పాఠశాలపై , చేస్తున్న పోరాటాన్ని ఆయన సమర్ధించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు తమ విధులు తాము చేస్తున్నప్పటికీ.. బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ హెల్త్ కోసం మనం ప్రైవేట్ సెక్టార్ వైపు చూస్తున్నామని, అయితే అది ఆసరాగా చేసుకొని రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ దోచుకుంటున్నారని కోపంతో రగిలిపోయారు. Also Read: ''కోవిడ్ కారణంగా పనులు లేక జనం ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో.. కొంత ఫీజు తగ్గిస్తే బాగుంటుందని పిల్లలందరి తల్లిదండ్రుల తరఫున స్కూల్ యాజమాన్యాన్ని అడిగినందుకు శివ బాలాజీ, మధుని బాయ్‌కాట్ చేసి వాళ్ళ ఇద్దరు పిల్లలను ఆన్‌లైన్ క్లాసుల నుంచి బ్లాక్ చేయడమేనేది క్రైం.. భారత రాజ్యాగానికి విరుద్ధంగా వెళ్తూ స్కూల్ యాజమాన్యం చేసిన క్రైం ఇది'' అంటూ సంచలన కామెంట్స్ చేశారు నరేష్. లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ డెమోక్రసీకి విలువివ్వకుండా, కనీసం పేరెంట్స్‌ అభ్యర్థనకు రెస్పాన్స్ ఇవ్వకుండా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారంటే మీ మోరల్ వాల్యూస్ ఎక్కడపోయాయని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు నరేష్. అంతటితో ఆగక.. శివ బాలాజీ, మధుమిత స్కూల్ యాజమాన్యాన్ని నిలదీసి మంచి పని చేశారని నరేష్ తెలిపారు. ఇప్పటికీ స్కూల్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడమే గాక.. పబ్లిసిటీ కోసం శివబాలాజీ, మధుమిత ఇలా చేస్తున్నారని చెప్పడం అనేది స్కూల్ యొక్క నైతిక విలువలను, థింకింగ్‌ని బయటపెడుతోందని అన్నారు. వెరీ బ్యాడ్.. చాలా బాధాకరం. పబ్లిసిటీ కోసమో లేదా తన పిల్లల కోసమో కాదు శివబాలాజీ ఈ పోరాటం చేసేది. పిల్లలందరి తల్లిదండ్రుల కోసం, న్యాయం కోసం పోరాడుతున్నారు అని తెలిపారు. Also Read: ఈ ఇన్సిడెంట్ మళ్ళీ ఎక్కడా రిపీట్ కాకూడదు. పేరెంట్స్‌కి విలువివ్వకుండా పిల్లల పరిస్థితి ఆలోచించకుండా వాళ్ళని బ్లాక్ చేస్తే ఆ చిన్నారుల మనసు ఎంత మానసిక క్షోభకు గురవుతుంది? అంటూ ఫైర్ అయిన నరేష్.. శివబాలాజీ దంపతులకు తన సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని, అసరమైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ దాకా తీసుకుపోతామని అన్నారు. శివబాలాజీ క్యారెక్టర్‌కి విలువ ఇస్తున్నానని, మీ ఫైటింగ్ స్పిరిట్‌ని గౌరవిస్తున్నానని.. కళాకారులకే కాదు ప్రతి పేరెంట్‌కి తన సపోర్ట్ ఉంటుందని ఆయన తెలిపారు. 'ఈ రకమైన విద్యాసంస్థలపై ఫైట్ చేయబోతున్నాం.. బీ ప్రిపేర్' అంటూ ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు నరేష్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RKH4Xj

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....