Thursday 3 September 2020

Nagarjuna: బిగ్ బాస్ ఒక్కటే కాదండోయ్ అక్కడ కూడా.. నాగార్జున డేరింగ్ స్టెప్స్!

బుల్లితెర భారీ రియాలిటీ షో బిగ్ బాస్ తెరపై సందడి చేయబోతున్న మరో డేరింగ్ డిసీజన్ తీసుకున్నారు. నటీనటులంతా కరోనా భయంతో జంకిపోతుంటే నాగార్జున మాత్రం ధైర్యంగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ షూటింగ్‌లో పాల్గొన్న ఆయన తాజాగా తన కొత్త సినిమా '' కోసం కెమెరా ముందుకొచ్చేశారు. కరోనా లాంటి భయాన్ని పక్కనబెట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ సెట్స్‌పై హుషారుగా కదిలారు. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడం, షూటింగ్స్ బంద్ కావడంతో సెలబ్రిటీలంతా వారి వారి ఇళ్లకే పరిమితమై కాలం గడుపుతున్నారు. దాదాపుగా 5 నెలలకు పైగా ఇదే పరిస్థితి. కొన్నిరోజుల క్రితం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్‌కి పర్మిషన్స్ ఇచ్చినా సెట్స్ మీదకు రావడానికి నటీనటులతో పాటు దర్శకనిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ కింగ్ నాగార్జున సాహసం చేస్తూ డేరింగ్ స్టెప్స్ వేస్తున్నారు. Also Read: నిన్న (సెప్టెంబర్ 3న) నాగార్జున 'వైల్డ్ డాగ్' షూటింగ్‌ సెట్స్ మీదకు వచ్చేశారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కరోనా పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు. మేక‌ప్‌మెన్‌లు, హెయిర్‌స్టైలిస్ట్‌లు ఫేస్ మాస్క్‌లు ధ‌రించి త‌మ తమ విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఇకపోతే అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని గతంలోనే కొంతభాగం కంప్లీట్ చేసి తిరిగి 6 నెలల తర్వాత రెగ్యులర్ షూట్ ప్రారంభించారు. ఇందులో నాగార్జున ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా నటిస్తుండగా, దియా మీర్జా హీరోయిన్‌గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ 'వైల్డ్ డాగ్' ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2DsNve5

No comments:

Post a Comment

'Rekha And I Didn't Speak To Each Other For 20 Years'

'Rekha and my wife were close friends, and my so-called cold war with Rekha was causing difficulties in my wife's friendship with he...