సండే అంటే బిగ్ బాస్ హౌస్‌లో ఫన్ డే లెక్క. నాగార్జున ఎంట్రీతో పాటు.. వారం మొత్తం జరిగిన ఇష్యూలపై చర్చలు ఫన్నీ ఫన్నీ ఆట పాటలతో పాటు కీలకమైన తొలివారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉండటంతో ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఒకరు బిగ్ బాస్ హౌస్ నుంచి బ్యాగ్ సర్దేయనున్నారు. అంతేకాదు.. ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్ ప్లేస్‌లో మరో కొత్త కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇంతకీ ఎలిమినేట్ కాబోయేది ఎవరు? కొత్తగా వచ్చే ఆ కంటెస్టెంట్ ఎవరన్నది ఆసక్తితో ఆదివారం నాటి ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ 8వ ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. రాములో రాములో సాంగ్‌కి మోడల్స్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. అనంతరం ఆలస్యం చేయకుండా నా టీవీ ద్వారా ఇంటి సభ్యులతో ముచ్చటించారు నాగార్జున. నామినేషన్స్‌లో ఉన్న నలుగురిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు కాబట్టి.. వారిని ఊరికే పంపించకుండా ఆట పాటలతో పంపిద్దాం అంటూ మంచి డాన్స్‌తో నేటి బిగ్ బాస్ ఆటను షురూ చేశారు నాగార్జున. ఆడవాళ్లు, మగవాళ్లు రెండు గ్రూప్‌లుగా విడగొట్టి.. బిగ్ బాస్ హౌస్‌లో ప్లే చేసిన సాంగ్‌కి ఒక్కొక్కరు చొప్పున వచ్చి డాన్స్ పెర్ఫామ్ చేయాలని.. వారిలో ఎవరు బాగా డాన్స్ చేశారో డాన్సర్ మాస్టర్ రాజశేఖర్ డిసైడ్ చేస్తారని ఈ డాన్స్ షోను ప్రారంభించారు నాగార్జున. మొదటిగా జిలేల్ రాణి సాంగ్‌కి డాన్స్ చేయడానికి మొనాల్, మెహబూబ్‌లు పోటీ పడ్డారు. అయితే ఈ డాన్స్ షోలో మొనాల్‌కి రాజశేఖర్ మాస్టర్ 6 మార్కులే ఇవ్వగా.. నాగార్జున 7 మార్కులు ఇచ్చారు. మొహబూబ్ డాన్స్‌తో బిగ్ బాస్ స్టేజ్ ను షేక్ చేయడంతో రాజశేఖర్ నుంచి 9, నాగార్జున నుంచి 9 మార్కులు ఇచ్చారు. అనంతరం కళ్యాణి-సొహైల్‌లు పెద్ద పులి సాంగ్‌కి పోటీ పడా.. కళ్యాణికి 7 మార్కులు, సొహైల్‌కి 6 మార్కులు ఇచ్చారు రాజశేఖర్. అయితే నాగార్జున కళ్యాణికి 9 మార్కులు, సొహైల్ 7 మార్కులు ఇచ్చారు. అనంతరం దేత్తడి హారిక- నోయల్‌లు పోటీ పడగా.. నాగార్జున ఇద్దరికీ చెరో 8 మార్కులు ఇచ్చారు.. అలాగే రాజశేఖర్ మాస్టర్ ఇద్దరికీ 8 మార్కు చొప్పున ఇచ్చారు. ఇక సిటీ మార్ సాంగ్‌కి అభిజిత్-టీవీ 9 యాంకర్ దేవిలు పోటీ పడగా.. బ్లాక్ శారీలో స్టెప్పులు వేసి రచ్చ చేసింది దేవి. డాన్స్ చేస్తుంది దేవినేనా అన్నట్టుగా హౌస్‌ని షేక్ చేసింది. అయితే ఈ కాంపిటేషన్‌లో దేవికి రాజశేఖర్ మాస్టర్ 8 మార్కులు ఇవ్వగా.. అభిజిత్‌కి 6 మార్కులు ఇచ్చారు. ఇక నాగార్జున.. యాంకర్ దేవికి 8 మార్కులు ఇవ్వగా.. అభిజిత్‌కి 7 మార్కులు ఇచ్చారు. ఇక మైండ్ బ్లాక్ సాంగ్‌కి దివి-అకిల్‌లు పోటీ పడగా.. లంగాఓణిలో స్టెప్పులు వేసి మైండ్ బ్లాక్ చేసేదింది దివి. సొట్ట బుగ్గలతో అదరిపోయే ఎక్స్ ప్రెషన్స్‌తో ఫిదా చేసింది. దీంతో రాజశేఖర్.. దివికి 8 మార్కులు ఇవ్వగా అఖిల్‌కి ఐదు మార్కులు ఇచ్చారు. ఇక నాగార్జున దివికి 8 మార్కులు, అకిల్‌కి 7 మార్కులు ఇచ్చారు. చివర్లో సూర్య కిరణ్- లాస్యలు నక్కిలీసు గొలుసు పాటకు పోటీ పడగా.. షర్ట్ విప్పి మరీ స్టెప్పులతో రచ్చ చేశాడు. అతని పెర్ఫామెన్స్ చూసి.. ఫేడ్ ఔట్ అంటూ అరిచారు నాగార్జున. సాంగ్ ఆపకపోతే బనియన్ కూడా తీస్తే మా పరిస్థితి ఏంటి అంటూ పంచ్ వేశారు నాగార్జున. కదలకుండా ఒక్క చోట ఉండి.. స్టెప్పులు వేయడం ఎలా అని నిన్ను చూసి నేర్చుకోవచ్చు అని చెప్పారు నాగార్జున. ఈ కాంపిటేషన్‌లో సూర్య కిరణ్‌కి 8 లాస్యకి 7 మార్కులు చొప్పున ఇచ్చారు నాగార్జున, రాజశేఖర్ మాస్టర్. చివర్లో ఫినిషింగ్ టచ్ ఇస్తూ గంగవ్వ- రాజశేఖర్ మాస్టర్‌లు అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్‌కి అదిరిపోయే స్టెప్‌లు వేశారు. గంగవ్వ డాన్స్ పెర్ఫామెన్స్‌కి 10 మార్కులు ఇచ్చారు నాగార్జున. మొత్తంగా ఈ డాన్స్ కాంపిటేషన్‌లో గర్ల్స్ టీంకి 91 పాయింట్స్ రావడంతో విజేతగా ప్రకటించారు నాగార్జున. అయితే బాయ్స్‌కి 88 మార్కులు వచ్చాయి. కేవలం 3 పాయింట్ల తేడాతో ఓడిపోయారు. గెలుపొందిన గర్ల్స్ టీంకి ఫ్రైజ్‌గా డాబర్ రియల్ మాంగో ఫ్రిడ్జ్ కీస్ ఇచ్చారు నాగ్. (అప్డేట్స్ కొనసాగుతాయి). బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ల వివరాలు.. 1. మోనాల్ గుజ్జార్ 2. డైరెక్టర్ సూర్యకిరణ్ 3. యాంకర్ లాస్య 4. హీరో అభిజిత్ 5. జోర్దార్ యాంకర్ సుజాత 6. మెహబూబ్ దిల్‌సే 7. టీవీ 9 యాంకర్ దేవి 8. దేత్తడి హారిక 9. టీవీ యాక్టర్ సయ్యద్ సోహైల్ 10. యాంకర్ అరియానా గ్లోరీ 11. అమ్మ రాజశేఖర్ 12. కరాటే కళ్యాణి 13. సింగర్ నోయల్ 14. హీరోయిన్ దివి (Divya Vadthya) 15. అఖిల్ సార్థక్ 16. గంగవ్వ
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hn0hIV
No comments:
Post a Comment