Saturday 5 September 2020

అఖిల్ స్కూల్‌మేట్ అభిజిత్ బిగ్ బాస్‌లో.. మనోడి బ్యాగ్రౌండ్ వయా చార్మినార్

ఈరోజు సాయత్రం 6 గంటల నుంచి బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే స్టార్ మా ప్రోమో వదలగా.. సందడి ఏ రేంజ్‌లో ఉండబోతుందని ప్రీమియర్ టీజర్‌లో చెప్పకనే చెప్పారు. ‘మాస్క్ ముఖానికి ఎంటర్‌టైన్మెంట్‌కి కాదు’.. అంటూ హోస్ట్ నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. గత సీజన్లలో లిస్ట్ ముందే లీక్ అవ్వగా.. ఈ సీజన్‌కి మాత్రం ఒకరిద్దరు తప్ప మిగిలిన కంటెస్టెంట్స్ వివరాలను గోప్యంగా ఉంచడంలో సక్సెస్ అయ్యింది స్టార్ మా. అయితే టీవీ 9 యాంకర్ దేవితో పాటు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ అభిజిత్‌ కూడా బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా రాబోతున్నట్టు సమాచారం. వీరితో పాటు మరో 12 మంది లిస్ట్ బయటకు రాగా.. వీరిలో ఎవరు ఉంటారన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే దాదాపు ఈ లిస్ట్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఫైనల్ కంటెస్టెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ సీజన్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెడుతున్న అభిజిత్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో పాపులర్ అయ్యారు. ఈ చిత్రంతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అభిజిత్.. మిర్చీలాంటి కుర్రాడు సినిమాతోనూ అలరించాడు. ఆ తరువాత యుఎస్ వెళ్లిన ఇతగాడు ఇదిగో ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేయబోతున్నాడట. అభిజిత్‌తో అక్కినేని ఫ్యామిలీకి మంచి అనుబంధమే ఉంది. నాగార్జున తనయుడు అఖిల్ చదివిన కిండర్ గార్టెన్ (చైతన్య విద్యాలయ) స్కూల్‌‌లోనే అభిజిత్ కూడా చదివాడు. అఖిల్ స్కూల్ మేట్‌తో పాటు క్లాస్ మేట్ కూడా. తరువాత అభిజిత్.. మదనపల్లిలోని రిషి వ్యాలీ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి, కొంపల్లిలోని మల్లా రెడ్డి కాలేజీ నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. అయితే అభిజిత్ ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే.. శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా కోసం కొత్త నటీ నటుల కోసం అన్వేషిస్తుండగా.. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ద్వారా ఈ సినిమాలో అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు అభిజిత్. అదే సినిమాలో అక్కినేని అమల కూడా అభిజిత్‌కి తల్లిగా చేసింది. అక్టోబర్ 11, 1988 న జన్మించిన అభిజీత్ ఫ్యామిలీకి నిర్మాణ రంగంలో మంచి అనుభవం ఉంది. ఆయన పూర్వీకులు చార్మినార్ నిర్మాణంలో పాలు పంచుకోవడం విశేషం. అప్పట్లో చార్మినార్ గోడలు మరియు నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి వలస వచ్చిన అభిజిత్ పూర్వీకులు.. చార్మినార్ నిర్మాణం కోసం.. గుడ్లు పగలగొట్టడం, పచ్చసొనను కాంక్రీట్ మిశ్రమంలో కలపడం లాంటి పనులు చేశారట. ఇప్పటికీ అభిజిత్ ఫ్యామిలీ నిర్మాణ రంగంలోనే ఉండగా.. అభిజిత్ మాత్రం సినిమాలపై మక్కువ చూపిస్తున్నారు. చూడ్డానికి చాలా సాఫ్ట్‌గా కూల్‌గా కనిపించే రచ్చ రంబోలాకి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎలా రాణిస్తాడో చూడాలిమరి. అభిజిత్ మినహా.. బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్ట్ ‘సమయం తెలుగు’ అంచనా.. 1. టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి (TV9 News Presenter Devi) 2. యాంకర్ లాస్య మంజునాథ్ (anchor lasya manjunath) 3. జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash) 4. గంగవ్వ (YouTube Gangavva) 5. కొరియోగ్రాఫర్ కమ్ డాన్స్ మాస్టర్ అమ్మా రాజశేఖర్ (Amma Rajasekhar) 6. సింగర్ నోయల్ (Noel Sean) 7. హీరోయిన్ మొనాల్ గుజ్జార్ (Actress Monal Gajjar) 8. యాంకర్, యూట్యూబ్ సంచలనం దేత్తడి హారిక (Dethadi Harika) 9. యాంకర్ అరియానా గ్లోరీ (Anchor Ariyana Glory) 10. యాంకర్ తనూజా పుట్టాస్వామి (Anchor Thanuja Puttaswamy) 11. టీవీ నటుడు సయ్యద్ సోహైల్ (Syed Sohel Ryan) 12. యూట్యూబ్ స్టార్ మెహబూబా దిల్ సే (mehaboob dil se) 13. కరాటే కళ్యాణి (Karate Kalyani) 14. డైరెక్టర్ సూర్య కిరణ్ (Director Surya Kiran)


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2FencZx

No comments:

Post a Comment

'Preparing to enter affordable housing loans space'ns'

'Focus will be on smaller loan amounts to meet the needs of affordable homebuyers.' from rediff Top Interviews https://ift.tt/J1zq...