Saturday 5 September 2020

ఇండియన్స్ అలాంటి మూడ్‌లో లేరు.. మన చరిత్ర, సంస్కృతే నాశనం చేస్తున్నాయి: పూరి సంచలన వ్యాఖ్యలు

ఈ లాక్‌డౌన్ సమయాన్ని మరో రకంగా వినియోగించుకుంటూ సంచలనం సృష్టిస్తున్నారు డాషింగ్ డైరెక్టర్ . తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతూ పోడ్ కాస్ట్ ఆడియోల రూపంలో బయటపెడుతున్నారు. దేశ విదేశాల సంస్కృతీ సంప్రదాయాలతో పాటు సోషల్ ఇష్యూస్, పర్సనల్ డెవలప్‌మెంట్‌, లైఫ్ స్ట్రగుల్స్‌ ఇలా అన్ని అంశాలను టచ్ చేస్తూ మాటల తూటాలు పేల్చుతున్నారు. ఈ క్రమంలో ఓ ఆడియో ద్వారా ఇండియన్స్ మూడ్ ఎలా ఉంటుందో చెబుతూ భారతీయులపై సంచలన వ్యాఖ్యలు చేశారు పూరి. ఈ ఆడియోలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ''అమెరికాకి చరిత్ర లేదు. కానీ మనకి ఉంది. అమెరికా గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు.. కానీ ఇండియాకి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. సంస్కృతి ఉంది. అయితే ఈ చరిత్ర వల్లనే మనం ఎదగట్లేము. 90 ఏళ్ల ముసలోడు ఫ్యూచర్ గురించి ఆలోచించడు. ఎప్పుడూ గతంలోనే బ్రతుకుతాడు. స్వీట్ మెమొరీస్ తలచుకుంటూ నవ్వుకుంటూ బ్రతుకుతాడు. ఫ్యూచర్ ఆలోచనే ఉండదు. Also Read: పోనీ ఇన్నేళ్ల సంస్కృతి చూసి మనం ఏమైనా నేర్చుకుంటున్నామా అంటే అదీ లేదు. వేదాలు, ఉపనిషత్తుల గురించి తలచుకొని పొంగిపోవడమే తప్ప ఎప్పుడైనా తొంగి చూశామా? ఏ ఇంట్లోనూ భగవద్గీత పుస్తకం ఉండదు. ఒకవేళ ఉన్నా అందులో ఏముందో తెలియదు. ఇంట్లో ఎవరైనా పొతే తప్ప ఆ ఘంటసాల గారి క్యాసెట్ కూడా ప్లే చేయరు. పోనీ అప్పుడైనా వింటామా అంటే వినం. ఏ పిన్నినో పట్టుకొని ఏడుపుతో బిజీగా ఉంటాం. ఇంతకీ నేను చెప్పేది ఏటంటే.. ఇండియన్స్ అందరం ముసలోళ్లలా తయారయ్యాం. గతంలోనే బ్రతుకుతున్నాం. కొత్త విషయాలు నేర్చుకునే మూడ్‌లో లేము. అమెరికన్స్‌కి ఏ చరిత్ర లేదు కాబట్టి పసిపిల్లల్లా అన్నీ నేర్చుకుంటున్నారు'' అని చెప్పారు. అయితే ఆయన చెప్పిన ఈ మాటలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియన్స్‌ని తక్కువ అంచనా వేయడం సరికాదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2R0ZtyF

No comments:

Post a Comment

'Preparing to enter affordable housing loans space'ns'

'Focus will be on smaller loan amounts to meet the needs of affordable homebuyers.' from rediff Top Interviews https://ift.tt/J1zq...