Saturday 5 September 2020

విశాఖలో సినిమా సందడి.. లాక్ డౌన్ తర్వాత మొదటి షూటింగ్ ఇదే..!

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. ముఖ్యంగా ఎంటర్‌టైన్మెంట్ రంగం కుదేలైపోయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సినీ, సీరియల్ షూటింగ్స్‌కు అనుమతిచ్చింది. దీంతో లాక్ డౌన్ తర్వాత మొట్టమొదటిసారిగా నగరంలో సినిమా షూటింగ్‌ సందడి మొదలైంది. విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులో శుక్రవారం సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో గత 5 నెలలుగా విశాఖలో సినీ షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనల సడలింపు (అన్‌లాక్ 4.0) అనంతరం శుక్రవారం బీచ్‌ రోడ్డులోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ‘ఐపీఎల్‌’ పేరుతో రూపొందిస్తున్న సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్ర యూనిట్‌ సభ్యులు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ షూటింగ్‌ జరిపారు. ఈ దృశ్యాలను తిలకించేందుకు విశాఖ నగర ప్రజలు బీచ్‌రోడ్డుకు తరలివచ్చారు. దీంతో విశాఖ బీచ్‌లో మళ్లీ పాత రోజులు గుర్తొచ్చాయని స్థానికులు తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2DvBcO8

No comments:

Post a Comment

'Preparing to enter affordable housing loans space'ns'

'Focus will be on smaller loan amounts to meet the needs of affordable homebuyers.' from rediff Top Interviews https://ift.tt/J1zq...