సినిమాలో అవకాశాల కోసం వెళ్తే ఓ బాలీవుడ్ డైరెక్టర్ తనను వేధించాడని, గదిలోకి తీసుకెళ్లి బ్లూ ఫిలిమ్ చూపించాడని నటి కొద్దిరోజుల క్రితం సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ డైరెక్టర్ ఎవరా? అని అందరూ ఆలోచనలో పడ్డారు. తాజాగా తనను వేధించింది స్టార్ డైరెక్టర్ అంటూ బాంబు పేల్చింది పాయల్. స్త్రీ స్వేచ్ఛ గురించి ఉపన్యాసాలు చెప్పే అతడే నా పట్ల అసభ్యంగా ప్రవర్తించి వేధింపులకు గురి చేశాడని తెలిపింది. Also Read: ‘అనురాగ్ కశ్యప్ 'బాంబే వెల్‌వెట్' సినిమాను డైరెక్ట్ చేస్తున్న సమయంలో నేను ఛాన్స్ కోసం ఆయన్ని కలిశాను. మరుసటి రోజే ఫోన్ పిలిస్తే ఆయన వద్దకు వెళ్లాను. ఆ సమయంలో అనురాగ్ మద్యం తాగుతున్నాడు. నాతో కాసేపు మాట్లాడిన తర్వాత మరో గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ సోఫాలో కూర్చున్న తర్వాత.. ‘రణబీర్ కపూర్ సినిమాలో నటించాలనుకునే అమ్మాయిలు నాతో పడుకోవడానికి వెనుకాడరు’ అని చెప్పాడు. నాతో సన్నిహితంగా మెలిగితే భవిష్యత్‌లో నీకు మేలు జరుగుతుందని తెలిపాడు.’ Also Read: ‘సినిమా ఇండస్ట్రీలో శారీరక సంబంధాలు పెట్టుకోవడం కామన్, చాలామంది హీరోయిన్లు నేను ఫోన్ చేస్తే పక్కలోకి రావడానికి రెడీ ఉంటారు. నేను చెప్పినట్లు వింటే నీకూ అవకాశాలు వస్తాయి’ అని అనురాగ్ నాతో చెప్పాడు. ఆ సమయంలో ఏం చేయాలో నాకు తోచలేదు. ఆ సమయంలో తాను శారీరకంగా, మానసికంగా సిద్ధం లేనని, మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పి తప్పించుకున్నాను. ఈ విషయాన్ని బయటపెడదామనుకుంటే చాలామంది అడ్డుకున్నారు. ఆయనతో పెట్టుకుంటే నాకు భవిష్యత్ ఉండదని చెప్పడంతో సైలెంట్ అయిపోయాను. ఓ అమ్మాయి అవకాశాల కోసం డైరెక్టర్‌ని కలిసినంత మాత్రాన వేశ్యలా భావించడం సరికాదు’ అని పాయల్ చెప్పుకొచ్చింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RGcNsH
No comments:
Post a Comment