Sunday, 6 September 2020

హీరోయిన్‌ను పెళ్లాడిన బిగ్ బాస్ విన్నర్.. ఘనంగా వివాహ వేడుక

బిగ్ బాస్ తమిళ్ సీజన్ 1 విన్నర్ అరవ్ నఫీజ్ ఓ ఇంటివాడయ్యారు. హీరోయిన్ రాహియాను అరవ్ ఈరోజు (సెప్టెంబర్ 6న) పెళ్లాడారు. వీరి వివాహం చెన్నైలోని ఓ స్టార్ హోటల్‌లో చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. ఈ వివాహ వేడుకలో బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్లు కూడా పాల్గొన్నారు. ఈ మేరకు నూతన దంపతులతో తీసుకున్న ఫొటోను నటి బిందు మాధవి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. బిందు మాధవి కూడా తమిళ బిగ్ బాస్ తొలి సీజన్‌లో పాల్గొన్నారు. బిందు మాధవితో పాటు బిగ్ బాస్ తమిళ్ హౌజ్‌మేట్స్ స్నేగన్, గాయత్రి రఘురాం, హారతి, వయాపురి, హరీష్ కళ్యాణ్, గణేష్ వెంకట్రామ్, శక్తి, కాజల్ పశుపతి, సుజా వరుణి ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కలిసి తీసుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వీరితో పాటు డైరెక్టర్లు కె.ఎస్.రవికుమార్, చరణ్, విజయ్, రంజిత్ జయకోడి, ప్రదీప్ క్రిష్ణమూర్తి, సంగీత దర్శకుడు సైమన్ కింగ్, సినిమాటోగ్రాఫర్ శక్తివేల్, నటుడు వరుణ్ కూడా ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. కాగా, స్నేహితులుగా ఉన్న అరవ్, రాహియా.. ఏడాది క్రితం ప్రేమికులుగా మారారు. తల్లిదండ్రుల అంగీకారంతో ఇప్పుడు పెళ్లిచేసుకున్నారు. అయితే, అరవ్-రాహియా వివాహం ఓవియా ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఓవియా కూడా బిగ్ బాస్ తమిళ్ సీజన్ 1లో కంటెస్టెంట్. బాగా పాపులర్ కూడా. హౌజ్‌లో అరవ్, ఓవియా చాలా క్లోజ్‌గా ఉండేవారు. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చిన తరవాత కూడా వీరి స్నేహం కొనసాగింది. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే ప్రచారం కూడా బాగా జరిగింది. ఆ ప్రచారానికి ఈ పెళ్లితో ఫుల్‌స్టాప్ పెట్టేశారు అరవ్. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3216FBm

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....