Sunday 6 September 2020

బైక్ నడిపిన రోజా.. అంబులెన్స్ డ్రైవర్లతో ధీటుగా రై.. రై

జబర్దస్త్ రోజానా మజాకా.. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్ 108 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించినప్పుడు నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ ఆర్కే అంబులెన్స్ డ్రైవర్ చేసి నడిపి అందరినీ అబ్బురపరిచారు. ఇప్పుడు అదే చొరవతో బైక్ అంబులెన్స్‌లను డ్రైవ్ చేసి ఔరా అనిపించారు. నగరి కోరిక మేరకు శ్రీ సిటీ హీరో మోటార్స్ కంపెనీ రెండు బైక్ అంబులెన్స్ వాహనాలను అందించింది. వాటిని నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే రోజా తన చేతుల మీదుగా ఆదివారం నాడు ప్రారంభించారు. నగరి, పుత్తూరు ప్రభుత్వాసుపత్రులకు చెరొకటి అందజేయనున్నారు. ఈ క్రమంలో బైక్ అంబులెన్స్‌లను నడిపి సందడి చేశారు రోజా. దర్జాగా బైక్ డ్రైవ్ చేస్తూ ఫొటోలకు పోజులు ఇచ్చారు రోజా. ఈ కార్యక్రమంలో నగరి పుత్తూరు మెడికల్ ఆఫీసర్లు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు పట్టణ ముఖ్య నాయకులు శ్రీ సిటీ హీరో మోటార్స్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2FffaQ7

No comments:

Post a Comment

'I Smiled Each Time Amitabh Slipped'

Rajesh Khanna: 'When I saw Namak Haram at a trial at Liberty cinema, I knew my time was up.' from rediff Top Interviews https://if...