Sunday, 20 September 2020

న్యాయం కోసం పోరాడే ఓ బలమైన మహిళగా వస్తున్నా.. అందరి సపోర్ట్ కావాలంటూ రేణు దేశాయ్ రిక్వెస్ట్

ఫేమస్ హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య 18 ఏళ్ల తర్వాత తిరిగి కెమెరా ముందుకు రాబోతోంది. మంచి కథ, ప్రాజెక్ట్‌లో అవకాశం వస్తే మళ్లీ తప్పకుండా రీ ఎంట్రీ ఇస్తానని అనేక సందర్భాల్లో చెప్పిన ఆమె.. తాజాగా తన రీ ఎంట్రీ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించింది. అతిత్వరలో తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తానంటూ తన రీ ఎంట్రీ విషయాన్ని చెప్పేసింది రేణు దేశాయ్. ఈ మేరకు తన ఇన్స్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ పెట్టింది. తన లేటెస్ట్ లుక్ పోస్ట్ చేసిన రేణు దేశాయ్.. ''ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు రావడం ఆనందంగా, ఉత్సాహంగా ఉంది. ఓ అందమైన వెబ్‌ సిరీస్‌లో చేసేందుకు సైన్ చేశాను. అక్టోబర్‌లో ఈ వెబ్‌ సిరీస్ షూటింగ్‌ ప్రారంభం కానుంది. నిజాన్ని ఛేదిస్తూ న్యాయం కోసం పోరాడే బలమైన మహిళగా నటించనుండటం చాలా ఆతృతగా ఉంది. మీ అందరి నుంచి సపోర్ట్ ఆశిస్తున్నాను. సాయి కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి దర్శకుడు ఎమ్‌.ఆర్‌. కృష్ణ మామిడాల. నిర్మాతలు డిఎస్‌. రావు, ఎస్‌. రజినీకాంత్‌. సినిమాటోగ్రఫీ దాశరథి శివేంద్ర. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తా'' అని పేర్కొంది రేణు దేశాయ్. Also Read: నటిగా, దర్శకురాలిగా, రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేణుదేశాయ్.. ''బద్రి, జాని'' వంటి సినిమాల్లో నటించి ఫేమ్ అయింది. ఆ తర్వాత ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను నిర్మించి నిర్మాతగా మారింది. పవన్ కళ్యాణ్ నటించిన కొన్ని సినిమాలకు క్యాస్ట్యూమ్ డిజైనర్‌గానూ పనిచేసింది. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల సినీ పరిశ్రమకు దూరమై తిరిగి ఇప్పుడు కెమెరా ముందుకు రానుడటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు రైతు నేపథ్యంలో ఓ సినిమా రూపొందిస్తోంది రేణుదేశాయ్. ఈ సినిమాకు 'అన్నదాత సుఖీభవ' అనే టైటిల్ ఫిక్స్ చేసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35Ow17Q

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....