Sunday, 13 September 2020

అతని రేణూ దేశాయ్ ఏం దానం చేసిందో తెలుసా..? పవన్ మాజీ భార్య షాకింగ్ డిసీజన్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎంత యాక్టివ్‌గా ఉంటారనే విషయం అందరికీ తెలుసు. పవన్‌తో డివోర్స్ తీసుకున్నాక కొడుకు అకీరా, కూతురు ఆద్యతో ఉంటున్న రేణు.. నిత్యం సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో టచ్‌లో ఉంటోంది. ఎప్పటికప్పుడు అకీరా, ఆద్య సమాచారాలతో పాటు తనకు సంబంధించిన విశేషాలు షేర్ చేస్తూ హంగామా చేస్తున్న ఆమె తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెబుతూ పోస్ట్ పెట్టింది. తాను రెండోసారి జుట్టు దానం చేశానని పేర్కొంటూ కొత్త హెయిర్ స్టైల్‌తో లేటెస్ట్ లుక్ షేర్ చేసింది రేణు. స్థోమత లేని క్యాన్సర్ పేషెంట్‌కి తన జుట్టును దానం చేశానని తెలిపింది. చాలా కాలం నుండి ఈ పని చేయాలనుకుంటున్నానని చెప్పిన ఆమె క్యాన్సర్ పేషెంట్స్ కోసం జుట్టును దానం చేయండి అంటూ అందరినీ కోరింది. కరోనా తర్వాత అందరూ పూర్తిగా మారిపోయారని నమ్ముతున్నా అంటూ తనదైన స్టైల్ కామెంట్ వదిలింది. చేసిన ఈ పని చూసి.. ఎన్నో మంచి పనులకు ప్రేరణగా నిలుస్తున్న మీకు ధన్యవాదాలు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. Also Read: మోడలింగ్ రంగంలో నుంచి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రేణూ దేశాయ్.. నటిగా, రచయితగా, దర్శకురాలిగా అంతకుమించి పవన్ కళ్యాణ్ భార్య మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. 'బద్రి' మూవీలో పవన్‌తో ఆడిపాడిన ఆమె తొలి పరిచయంతోనే ప్రేమలో అతన్నే పెళ్లాడింది. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన నుంచి విడిపోయి స్వయంగా పిల్లల బాధ్యత చూసుకుంటోంది. ఇక మంచి కథల కోసం ఎదురు చూస్తున్నానని, అలాంటి కథలు వస్తే తప్పకుండా తెలుగు సినిమాల్లో నటిస్తానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో రేణూ చెప్పిన సంగతి తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2DWbWkl

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....