Tuesday 22 September 2020

‘కృష్ణవేణి’ ఫుల్ వీడియో సాంగ్.. బుజ్జిగాడు దుమ్ములేపుతున్నాడు!

యంగ్ హీరో , మాళవిక నాయర్ జంటగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. హెబ్బా పటేల్ కీలక పాత్ర పోషించారు. కొండా విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించారు. యూత్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. నిజానికి ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేయాలని నిర్మాత భావించారు. కానీ, కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతబడటంతో కుదరలేదు. అందుకే నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా ప్రచారంలో భాగంగా మంగళవారం ‘కృష్ణవేణి’ సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ పాట లిరికల్ వీడియో ఆకట్టుకుంది. కాసర్ల శ్యామ్ కుమార్ రాసిన ఈ తెలంగాణ యాసతో కూడిన సాంగ్‌ను రాహుల్ సిప్లిగంజ్ అంతే జోష్‌తో ఆలపించారు. పాటలో జోష్ ఎలా ఉందో.. వీడియోలో హీరో జోష్ కూడా అదే స్థాయిలో ఉంది. బుజ్జిగాడు దుమ్ములేపుతున్నాడు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. Also Read: కాగా, ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు నంద్యాల రవి మాటలు రాశారు. ఐ.ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. రియల్ సతీష్ ఫైట్స్ కంపోజ్ చేశారు. వేణు కూరపాటి కో-డైరెక్టర్. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కొండా విజయ్‌కుమార్‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3iT60Ia

No comments:

Post a Comment

When Amitabh, Rajesh Khanna Broke The Ice

Amitabh Bachchan: 'Success didn't affect me at all.' from rediff Top Interviews https://ift.tt/mXlOqDN