Saturday, 5 September 2020

సెక్సువల్ రిలేషన్స్‌పై సమీర్.. ఆమెను కజిన్ అని అబద్ధం చెప్పా.. నా భార్యకు నిజం తెలుసు, సిడ్నీ గర్ల్ ఫ్రెండ్‌పై ఓపెన్

కెరియర్ ప్రారంభంలో ఈటీవీ సీరియల్స్‌తో పాపులర్ అయిన సమీర్.. ఆ తరువాత సినిమాలతో బిజీ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్‌గా అలరించిన పర్సనల్ లైఫ్‌పై అప్పట్లో చాలా వివాదాలు నడిచాయి. ‘నా మొగుడు నాకు సొంతం’ సీరియల్ అప్పుడు సెట్‌లోనే హీరోయిన్‌తో రాసలీలలు సాగిస్తున్నాడని ఆయన్ని బలవంతంగా ఆ సీరియల్‌ నుంచి తీసేశారు. ఇక ఆ తరువాత కూడా సమీర్ చాలామందితో ఎఫైర్స్ నడిపాడని వార్తలు వచ్చాయి. తాను ఏ సీరియల్ చేస్తే ఆ సీరియల్ చేసే వాళ్లతో ఎఫైర్ అంటకట్టేవాళ్లని ఇటీవల కొన్ని విషయాలను టీఎన్ఆర్ టాక్ షోలో వివరించిన ఆయన తన సెక్సువల్ రిలేషన్స్ గురించి ఓపెన్ అయ్యారు. అదే సందర్భంలో తన భార్య తనను ఎందుకు చేసుకున్నానా? అని ప్రతిరోజు బాధ పడుతుందని తన పర్శనల్ విషయాలను షేర్ చేసుకున్నారు సమీర్. ఆయన మాట్లాడుతూ.. ‘ఇతన్ని పెళ్లి ఎందుకు చేసుకున్నానని నా భార్య () ప్రతిరోజు ఫీల్ అవుతూనే ఉంటుంది ఇప్పటికీ. బయటకు చెప్పదు కాని.. ఫీల్ అవుతూనే ఉంటుంది. వేరే చోటికి వెళ్లి ఉంటే లైఫ్ ఇంకొంచెం బెటర్‌గా ఉంటుందని ఉంటుంది కదా.. కాని ప్రేమిచండం విషయంలో నా వైపు నుంచి ఎలాంటి ఢోకా ఉండదు. మా మధ్య మంచి అండర్ స్టాడింగ్ ఉంటుంది. తను నాకంటే బెటర్ ప్లానర్. నాకంటే బాగా చదువుకుంది. తను డెలైట్‌లో సాప్ట్ వేర్ ఇంజనీర్. పెళ్లైన తరువాత ఎఫైర్స్ అంటే.. సుప్రీమ్ కోర్ట్ లీగల్ చేసేసింది (నవ్వుతూ).. పెళైన తరువాత ఎఫైర్స్ ఉండకూడదు.. ఇది మా ఆవిడకు కూడా తెలుసు. అయితే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లతో ఒక బార్డర్ వరకే దాన్ని దాటి వెళ్లను. నాకు ఎవరితోనూ సెక్సువల్ రిలేషన్స్ లేవు. అవి చాలా డేంజర్ అని నా అభిప్రాయం. చేసేటప్పుడు బాగానే ఉంటుంది.. తరువాత బయట పడితే గోల గోలగా ఉంటుంది. అందుకే వాటికి దూరంగా ఉంటా. అయితే అమ్మాయిల దగ్గర నుంచి నాకు ప్రపోజల్స్ వస్తాయి కాని.. నేను టెంప్ట్ కాను. మీరంటే ఇష్టం.. అదీ ఇంటారు. నా ఫ్రెండ్స్ చాలామంది బయట దేశాల్లో కూడా ఉన్నారు. అందులో గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మేం ఆరెంజ్ సినిమా కోసం మెల్ బర్న్ వెళ్లాం. నా ఫ్రెండ్ ఒకామె మెల్ బోర్న్‌లో చదువుతూ ఉండేది. నేను ఫేస్ బుక్‌లో పోస్ట్ పెడితే అక్కడే ఉన్న ఆమె చూసి.. నాకు ఎందుకు చెప్పలేదని అడిగింది. ఆమె నాకు ఆస్ట్రేలియాలో ఉన్నట్టు నాకు తెలియదు. వచ్చి నన్ను కలుస్తా.. షూటింగ్ చూస్తా.. రామ్ చరణ్ అంటే నాకు ఇష్టం అని చెప్పింది. ఓకే రా.. అని అనడంతో సిడ్నీ నుంచి మెల్ బోర్న్ వచ్చింది. Read Also: షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న వాళ్లందరికీ పరిచయం చేశా.. అయితే ఫ్రెండ్ అని చెప్తే అందరూ మోసేస్తారు. అందుకే కజిన్ అని పరిచయం చేశా. తమిళ కెమెరా మెన్ ప్రభుకి కూడా కజిన్ అని పరిచయం చేశా. తరువాత ఇంకో షెడ్యూల్‌కి మలేషియా వెళ్తే.. ప్రభుగారు నేను టిఫిన్ చేస్తుంటే.. ‘ఏం సమీర్.. మలేషియాలో ఎవరూ కజిన్స్ లేరా? అని అడిగారు.. నాకు దిమ్మతిరిగిపోయింది.. వాళ్ల ముందు మేం ఎంత అనిపించింది. లేదు సార్.. ఆమె నా ఫ్రెండ్.. కజిన్ అని అబద్ధం చెప్పానని ఒప్పేసుకున్నా’ అని తన పర్శనల్ విషయాలతో పాటు.. విదేశీ గర్ల్ ఫ్రెండ్స్‌పై వచ్చిన రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు యాక్టర్ సమీర్. Read Also:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/322qI24

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....