Friday 11 September 2020

పుట్టబోయే బిడ్డ పేరు చెప్పి షాకిచ్చిన నిఖిల్.. పల్లవితో పరిచయమైన కొద్ది రోజుల్లోనే అంటూ ఓపెన్ అయ్యాడిలా!

ఏంటి.. మ్యారేజ్ మొన్ననే అయింది కదా! అప్పుడే తండ్రి కాబోతున్నాడా? అని కంగారు పడుతున్నారు కదూ. అదేనండీ.. పెళ్లయ్యాక తండ్రి కావడం అనేది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి కావాల్సిందే కదా. కాబట్టి ఆ నిజాన్ని ముందే చెప్పి తమకు పుట్టబోయే బిడ్డ పేరును కూడా బయటపెట్టేశాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్. తాజాగా ప్రోగ్రాంలో పాల్గొన్న నిఖిల్‌ చాలా విషయాలు ఓపెన్‌గా మాట్లాడాడు. కాదు కాదు అలీ మాట్లాడించాడు. తాజాగా ఈ షో ప్రోమో వీడియోలో నిఖిల్ చెప్పిన సంగతులు ఆసక్తి కలిగిస్తున్నాయి. హుషారైన పాటకు స్టెప్పులేస్తూ ఆలీతో సరదాగా ప్రోగ్రాంకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్‌ని.. వెల్‌కమ్ టు ఆలీతో సరదాగా కొత్త పెళ్లికొడుకా అంటూనే ఓ జబర్దస్త్ పంచ్ వేశాడు అలీ. ఏంటి? పెళ్లికి బాగా ఖర్చు పెట్టవట కదా ఈ కోవిడ్ టైంలో.. ఎంత ఓ పాతిక వేలు పెట్టావా? అని అలీ అనడంతో నిఖిల్ తల కిందకు వేసుకొని నవ్వేశాడు. ఇక తన సతీమణిది భీమవరం అని చెప్పిన నిఖిల్‌తో మెల్లగా సీక్రెట్స్ ఓపెన్ చేయించాడు అలీ. Also Read: నీకు పాటలంటే ఇష్టమట.. అందులో చరణం ఇష్టమా లేక పల్లవి ఇష్టమా అంటే పల్లవే ఇష్టమని, తను నా భార్య కదా అని చెప్పాడు నిఖిల్. ఇక పెళ్లి జరిగి కొన్ని నెలలే అవుతుంది అప్పుడే పాప పేరు పెట్టేశారట ఏంటి సంగతి.. ఏమైనా గుడ్ న్యూస్ చెప్పేస్తారా? అని అలీ మరో చురక అంటిస్తూ ప్రశ్న వేశాడు అలీ. దీనిపై స్పందించిన నిఖిల్.. పల్లవిని కలిసిన తొలి రోజుల్లోనే నా కూతురు పేరు ‘మాయ’ అనుకుంటున్నా నీకు ఓకేనా అని అడిగాను. ఆమె కూడా నీ ఇష్టం అని చెప్పిందని చెప్పాడు. మరి కొడుకు పుడితే 'మాయలోడు' అని పెడతావా? అంటూ దీనిపై మరో కౌంటర్ వేశాడు అలీ. హీరోగా కావడం కోసమే ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యానని చెప్పిన నిఖిల్ హైదరాబాద్ నవాబ్స్ సినిమా అప్పుడు ఆఖరికి సూట్ కేసులు కూడా మోశానని చెప్పాడు. ఎవ్వరితో స్నేహం చేసినా అస్సలు వదలనని అలాగే అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసేటపుడు పెద్ద గ్యాంగ్ మెయిన్‌టైన్ చేసేవాడనని చెప్పాడు. అయితే తమ మధ్య ఎవడు ముందు డైరెక్టర్ అయినా నన్నే హీరోగా పెట్టాలని, ఒకవేళ నేను హీరో అయితే వారికి మొదటి అవకాశం ఇవ్వాలనే డీల్ కూడా ఉండేదని చెప్పాడు. అలాగే తనకు పవన్ కళ్యాణ్, రవితేజ స్టైల్ అంటే ఇష్టమని చెప్పిన నిఖిల్.. ఆ హీరోలనే ఎక్కువగా ఫాలో అవుతుంటానని చెప్పారు. ఇకపోతే దర్శకుడు కార్తికేయ షాపింగ్స్ చేయడం, బిల్స్ మాత్రం తనకు రావడం లాంటి సంగతులు చెబుతూ ఆలీతో సరదాగా ఎంజాయ్ చేశాడు నిఖిల్. మరి ఆ సరదా సంగతులు పూర్తిగా తెలుసుకోవాలంటే షో ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RlhqZc

No comments:

Post a Comment

'Will Keep Working To Grow Value Of New Businesses'

'Margins will be an outcome of that. They will likely remain somewhat range-bound.' from rediff Top Interviews https://ift.tt/mfch...