ప్రముఖ ర్యాపర్, సింగర్ నోయల్ పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకున్నారు. 'వెయ్యి అబద్ధాలు' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన నటి ఎస్తర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నోయల్ తన భార్యతో విడాకులు తీసుకున్నానని తెలియజేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. అయితే నటి ఎస్తేర్ కూడా నోయల్‌తో విడాకులు తీసుకున్న విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఇన్ స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘గత ఏడాదిగా నన్ను చాలా మంది అడిగిన ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చెబుతున్నా. లీగల్‌గా స్పష్ఠత వచ్చేవరకూ ఎదురుచూశాను.. ఇప్పుడు అధికారికంగా మేము విడాకులు తీసుకున్నాము. 2019 జనవరి 3న నోయల్, నేను పెళ్లి చేసుకున్నాము. ఆ తరువాత కొద్ది రోజులకే మా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అప్పటి నుంచి దూరంగా ఉంటున్నాము. జనవరిలో పెళ్లి కాగా.. జూన్‌లోనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం. అయితే వాయిదాల అనంతరం మా విడాకులపై కోర్టు తీర్పు నిన్న వచ్చింది. అయితే నేను అతనితో విడిపోవాలనే నిర్ణయానికి ఎందుకు వచ్చానో అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. మీ మద్దతు ఇంతకు ముందులాగే ఉంటుందని ఆశిస్తున్నా.. ఒక బంధాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలుసు.. మా ఇద్దరి రిలేషన్‌పై ఇదే నా క్లారిఫికేషన్. ఎంతైనా మనం మనుషులం. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటాం అని భావిస్తున్నా.. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి.. ఇంటర్వ్యూలలో ఈ పెళ్లి గురించి ప్రశ్నలు వేయకండి... కామెంట్స్ చేయకండి.. అందరికీ ధన్యవాదాలు’ వివరణ ఇస్తూ పోస్ట్ పెట్టింది హీరోయిన్ ఎస్తేర్. ఇక సింగర్ నోయల్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఎస్తేర్‌తో విడాకులు పొందిన విషయాన్ని తెలియజేశాడు. ‘నేను అఫీషియల్‌గా విడాకులు తీసుకున్నాను. ఎస్తేర్‌కి మంచి భవిష్యత్ ఉండాలని ఆశిస్తున్నా.. గాడ్ బ్లెస్ యు’ అంటూ ట్వీట్ చేసిన నోయల్.. వివరణ ఇస్తూ మరో పోస్ట్‌ను షేర్ చేశారు. ‘పెళ్లైన కొన్నాళ్లకే విడిపోయిన మేము.. ఈ విషయాన్ని పబ్లిక్‌గా చెప్పేందుకు కోర్టు తీర్పు కోసం వేచి చూశాం.. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలతో విడాకులు తీసుకున్నాము. ఈ విషయంలో.. ఎస్తేర్‌ను గానీ, నా కుటుంబాన్నిగానీ ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నా.. నేను బాధలో ఉన్నప్పుడు నా వైపుగా ఉన్న నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి థాంక్స్.. ఎస్తేర్ నీ కలలు నిజం కావాలని కోరుకుంటున్నా.. కొత్త జీవితం ప్రారంభించడానికి ఇది మంచి సమయం అని భావిస్తున్నా’ అంటూ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించాడు. అయితే సింగర్ నోయల్.. త్వరలో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోతున్నాడని.. క్వారంటైన్‌లో ఉన్న అతనికి కరోనా వచ్చిందని పుకార్లు షికారు చేశాయి. అయితే ఈ కోర్టు వ్యవహారం విడాకులు చూస్తే నోయల్ బిగ్ బాస్‌కి వెళ్లడం లేదని క్లారిటీ వచ్చేసినట్టే.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gMtJrF
No comments:
Post a Comment