ప్రఖ్యాత సంగీత దర్శకుడు, గాయకుడు ఎం.ఎం. కీరవాణి మంగళవారం ప్లాస్మా దానం చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. తన కుమారుడు భైరవతో కలిసి కిమ్స్ ఆసుపత్రిలోని ప్లాస్మా డొనేషన్ వింగ్‌లో ప్లాస్మా దానం చేసినట్లు తెలిపారు. కరోనా వైరస్ నుంచి కాపాడే ప్మాస్మాపై అనేక అపోహలు పోగొడుతూ ప్లాస్మా యోధుల కోసం ఒక పాటను రూపొందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి మంగళవారం నాడు తన కుమారుడితో కలిసి ప్లాస్మా దానం చేశారు. కరోనాను జయించిన ఆయన కుమారుడు కాల భైరవతో కలిసి కిమ్స్ ఆసుపత్రిలోని ప్లాస్మా డొనేషన్ వింగ్‌లో ప్లాస్మా దానం చేసినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్లాస్మా దానం చేయడం రక్తం దానం చేసినట్లే ఉందని తెలిపారాయన. ప్లాస్మా దానం భయపడవలసిన అవసరం దాతలు ఎవరైనా ముందుకు రావొచ్చన్నారు. కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరు ప్లాస్మాదానం చేయడానికి ముందుకు రావాలన పిలుపునిచ్చారు కీరవాణి. ఇక కీరవాణి తమ్ముడు, అగ్రదర్శకుడు రాజమౌళి కూడా ఇటీవల కరోనాను జయించి ప్లాస్మా డొనేట్ చేసిన విషయం తెలిసిందే. కాగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో ప్లాస్మా డొనేషన్ కార్యక్రమాలు వేగవంతం అవుతున్నాయి. చిరంజీవి, నాగార్జున, విజయ్ దేవరకొండ, రాజమౌళి, కీరవాణి వంటి సెలబ్రిటీలతో అవగాహన కల్పిస్తూ.. Donateplasma.scsc.in అనే వెబ్ సైట్‌లో ప్లాస్మా డొనేషన్ వివరాలను పొందుపరుస్తున్నారు. ఎవరికైనా ప్లాస్మా అవసరమైనా.. దానం చేయాలనుకున్నా ఈ వెబ్ సైట్‌ని సంప్రదించవచ్చు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hHKK7A
No comments:
Post a Comment