Saturday, 19 September 2020

Amma Rajasekhar: రాజశేఖర్‌ని మెడపట్టి బయటకు నెట్టిన యాంకర్ దేవి.. కన్నీరుమున్నీరైన మాస్టర్

బిగ్ బాస్ ఆటను రంజుగా మార్చేందుకు ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు డైరెక్టర్లు. తొలివారం గంగవ్వతో నడిపించగా.. రెండో వారంలో అభిజిత్-మొనాల్-అఖిల్‌ల మధ్య ట్రై యాంగిల్ లవ్ స్టోరీకి తెరతీశాడు. ఎపిసోడ్ నిడివి గంట ఉంటే.. వీళ్ల ఇంగ్లీష్ ప్రేమపైనే ఎక్కువ ఫోకస్ చేసి ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నారు. ఇక కొత్త కొత్త ప్రేమ కథలు, ఎఫైర్లకు కూడా తెర తీస్తున్నారు. అయితే శనివారం నాటి ఎపిసోడ్‌ ప్రోమోలను విడుదల చేయగా హోస్ట్ నాగార్జున ఉగ్రరూపం దాల్చారు. ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ టాస్క్‌లో ఎవరూ సీరియస్‌గా పార్టిసిపేట్ చేయలేదని ఫైర్ అవుతూ.. ప్రస్తుతం నామినేషన్‌లో ఉన్న రాజశేఖర్, కుమార్, నోయల్, గంగవ్వ, కళ్యాణి, హారిక, అభిజిత్, మోనాల్, సొహైల్‌లను నిలబెట్టి మరీ క్లాస్ పీకుతున్నారు. ఎవరి ఆట వాళ్లు ఆడకుండా.. సేఫ్ గేమ్ ఆడుతున్న వారిపై ఫైర్ అవుతూ.. తమంతట తాము జీరోలుగా భావించి నామినేషన్‌లోకి వచ్చిన వారికి శిక్షలు విధించారు నాగార్జున. జీరో అనే గేట్ ఒకటి పెట్టి అందులోనుంచి వాళ్లు ఎందుకు జీరోనో చెప్తూ బయటకు తోసేయాలని నాగార్జున కోరడంతో యాంకర్ దేవి ఎంటరై.. ‘కామెడీ చేస్తే ఇక్కడ హీరోలా’ అంటూ రాజశేఖర్ మాస్టర్‌ని మెడపట్టి ఆ జీరో గేట్‌ నుంచి బయటకు తోసింది. ఇక లాస్య సైతం రాజశేఖర్ మాస్టర్‌ని టార్గెట్ చేస్తూ.. మితిమీరిన కామెడీని నేను యాక్సెప్ట్ చేయను అంటూ రాజశేఖర్ మాస్టర్‌ని జీరో గేట్ నుంచి మెడపట్టి తోయడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు రాజశేఖర్ మాస్టర్. నేను వెళిపోతాను సార్.. నేను ఉండలేను.. పబ్లిక్ నన్ను క్షమించండి అంటూ దండం పెడుతూ మోకాళ్లపై పడి కన్నీరు మున్నీరుగా విలపించాడు. నా లైఫ్‌లో నన్ను మెడపట్టి గెంటిన వాళ్లు లేరు సార్.. నేను వీళ్లతో ఉండలేను పంపించేయండి సార్.. ప్లీజ్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రాజశేఖర్ మాస్టర్. పాపం గంగవ్వ అతని కన్నీళ్లు తుడుస్తూ.. మాస్టర్ హౌస్‌లో ఉండాల్సిందే అంటే తెగేసి నాగార్జునతో చెప్పే ప్రోమోను విడుదల చేసి శనివారం నాటి ఎపిసోడ్‌లో హైప్ క్రియేట్ చేశారు. మొత్తానికి హౌస్‌లో ఉన్న వాళ్లలో కాస్తో కూస్తో ఎంటర్‌టైన్ చేస్తున్నది రాజశేఖర్ మాస్టర్ మాత్రమే. అయితే శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో కిచెన్ టీం విషయంలో యాంకర్ దేవికి రాజశేఖర్‌కి మధ్య మాటా మాటా వచ్చింది. వాయిస్ పెంచి మాట్లాడితే ఒప్పుకోను అంటూ రాజశేఖర్ మాస్టర్‌కి గట్టిగానే చెప్పింది దేవి. రాజశేఖర్ మాస్టర్ కూడా అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు. దీంతో తనకు అవకాశం లభించడంతో యాంకర్ దేవి.. రాజశేఖర్ మాస్టర్‌పై శనివారం నాటి ఎపిసోడ్‌లో ప్రతాపం చూపించి మెడపట్టి నెట్టింది. ఇది బిగ్ బాస్ ఆడించే ఆట అయినప్పటికీ అందర్నీ నవ్వించే రాజశేఖర్ మాస్టర్ ఏడ్వడం ఎమోషనల్‌గా అనిపిస్తోంది. నిజానికి మెడపట్టి నెట్టడం అనే టాస్క్ ఇవ్వడం కూడా అంత మర్యాదగా లేదు. పైగా నామినేషన్ ప్రక్రియ సరిగా జరగడం లేదన్నప్పుడు అప్పుడే బిగ్ బాస్ మేల్కొని సక్రమంగా జరిపిస్తే సరిపాయే. ఇప్పుడు ఈ శిక్షలు దేనికో.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35WbjDb

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....