చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అధినేతలు, ప్రముఖ నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది గురించి పరిచయం అవసరంలేదు. నాగచైతన్య, సమంతతో ‘’ వంటి సూపర్ హిట్ మూవీని వీరు నిర్మించారు. ప్రస్తుతం హీరోగా ‘టక్ జగదీశ్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్‌గా ఎదుగుతోన్న ఈ ఇద్దరూ.. దర్శకుడు సుధీర్ వర్మ సోదరుడు ఫణి వర్మతో కలిసి హోటల్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నారు. వీరూ ముగ్గురూ కలిసి హైదరాబాద్‌లో రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నారు. 1980's మిలిటరీ హోటల్ పేరిట మణికొండలోని ఖాజాగూడలో నిర్మించిన ఈ రెస్టారెంట్‌ను సోమవారం (సెప్టెంబర్ 21న) ఉదయం 9:21 గంటలకు ఘనంగా ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా సాహు గారపాటి, హరీష్ పెద్ది, ఫణి వర్మ మాట్లాడుతూ.. ‘‘ఈనెల 21న హోటల్‌ను ప్రారంభిస్తున్నాం. మాంసాహారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 1980's మిలిటరీ హోటల్‌లో మా ఆతిథ్యాన్ని స్వీకరించే అవకాశాన్ని మిస్ కాకండి’’ అని అన్నారు. ‘‘ఈ కరోనా మహమ్మారి సమయంలో మీ కోరికలను చంపేసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, నిబంధనలను అనుసరిస్తూ మీకు ఆతిథ్యం అందిస్తామని మేం హామీ ఇస్తున్నాం. కాబట్టి, సురక్షితంగా కోరికలు తీర్చుకుందాం’’ అని వారు వెల్లడించారు. ఖాజాగూడలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదురుగా చైతన్య ఎంక్లేవ్‌లో తమ 1980's మిలిటరీ హోటల్ ఉందని వారు చెప్పారు. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kD1z4v
No comments:
Post a Comment