పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అక్కడ ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు చంకీ పాండే కుమార్తె అనన్యా పాండే.. విజయ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటివరకూ చిత్ర బృందం 40 రోజుల షూటింగ్ పూర్తి చేసుకోగా, వాటిలో రెండు భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. విజయ్ దేవరకొండ, రమ్యకృష్ణ, అనన్యా పాండే, రోణిత్ రాయ్, అలీ తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలు తీశారు. పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాని బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. అత్యంత ఆసక్తికరమైన ఈ క్రేజీ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాకు విష్ణుశర్మ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, ఇదివరకు పూరి జగన్నాథ్ ఫిల్మ్ ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమాకు పనిచేసిన కెచ్చా.. స్టంట్ మాస్టర్‌గా పని చేస్తున్నారు. Also Read: పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సహ నిర్మాణంలో నిర్మితమవుతోన్న ఈ యాక్షన్ ఫిల్మ్‌ను పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి నిర్మిస్తున్నారు. విష్ణురెడ్డి, మకరంద్ దేశ్‌పాండే, గెటప్ శ్రీను తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39yqBwx
No comments:
Post a Comment