Tuesday, 3 March 2020

యాంకర్‌ని రేప్ చేస్తామన్నారు, నేనే ఎన్టీఆర్‌కి మ్యూజియం కట్టిస్తా: రాకేష్ మాస్టర్ సంచలనం

పెద్ద పెద్ద కుటుంబాలకు చెందినవారిపై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. మొన్నటివరకు శ్రీరెడ్డిపై దారుణమైన కామెంట్స్ చేసిన మాస్టర్.. ఇటీవల ఎన్టీఆర్ కుటుంబం గురించి నోటికొచ్చినట్లు మాట్లాడేసారు. తారక్‌కు తన తాతపై అభిమానం ఉన్నట్లు నటిస్తున్నాడే తప్ప నిజంగా ప్రేమలేదని అన్నారు. దాంతో తారక్ ఫ్యాన్స్‌ ఆయనకు ఫోన్లు చేసి చంపేస్తామని బెదిరించారు. దాంతో సోమవారం పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇప్పుడు తారక్ ఫ్యాన్స్‌కి సారీ చెప్తూ.. తానో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ‘‘జూనియర్ ఎన్టీఆర్ మంచి నటుడు. మంచి పిల్లాడు. కానీ నాకు నందమూరి తారక రామారావు అంటే ప్రాణం. ఆయన నా ప్రాణం. నేను ముక్కుసూటి మనిషిని. నాకు తారక్ అన్ని కోణాల్లో నచ్చుతాడు. ఎందుకంటే పెద్దాయన తర్వాత అంతటి రేంజ్‌లో డైలాగ్ చెప్పే ఏకైక వ్యక్తి తారక్. కానీ అన్నగారిని పట్టించుకోని వాళ్ల గురించి కూడా చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. ఎందుకంటే నేను అభిమానిగా నందమూరి ఇంట్లో వ్యక్తిని. మద్రాస్‌లో అన్నగారికి ఓ ఇంటి. అది ఆయన సంపాదించుకున్న ఇల్లు. అక్కడ వాచ్‌మ్యాన్ లేడు. ఆడవాళ్లను అక్కడుకు తీసుకెళ్లి అఘాయిత్యాలకు పాల్పడటానికి ఆ ఇంటికి వాడుతున్నారు" READ ALSO: " ఆ ఇంటిని మ్యూజియం చేయాలని చెప్పాను. నేను అలా అడగటం తప్పా? ఈ విషయం గురించి నేను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ యాంకర్‌కు చెప్పాను. దాంతో ఎవరో కర్ణాటకకు చెందిన ఎన్టీఆర్ అభిమానులు ఆ యాంకర్ అమ్మాయికి ఫోన్ చేసి ఎత్తుకెళ్లిపోయి రేప్ చేస్తాం అన్నారట. అది ఎంత తప్పు. రామారావు గారి పోలికలు ఎన్టీఆర్‌కు కాస్తంత వచ్చాయి కానీ మొత్తం రాలేదు అని చెప్పాను. అందులో తప్పేముంది? నేను ఎక్కడా తారక్‌ను అతని అభిమానులను కించపరిచి మాట్లాడింది లేదు. నేను కర్ణాటక నుంచి ఫోన్ చేస్తున్నా ఏరా అంటూ మొన్న ఎవడో ఫోన్ చేసి బెదిరించాడు" "ఆ తర్వాత తారక్ అభిమానులే నాకు ఫోన్ చేసి సారీ బాబాయ్ ఏమీ అనుకోవద్దు వాడేదో తాగి మాట్లాడి ఉంటాడు అని చెప్పాడు. నన్ను ప్రేమగా పిలిచిన అభిమానులకు చేతులెత్తి సారీ చెప్తున్నా. కానీ నాకు ఫోన్లు చేసి బెదిరించనవారిని వెంట్రుకని తీసి పారేసినట్లు పారేస్తా. నేను ఎవ్వరికీ భయపడను. అన్నగారు స్వయంగా సంపాదించుకున్న ఇంటిని మ్యూజియం చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడంలేదు. అందుకే బోరబండలో నాకు నాలుగు అంతస్తుల ఇల్లు ఉంది. ఆ ఇంటిని అన్నగారి ఫొటోలతో నింపి మ్యూజియం చేయాలని అనుకుంటున్నాను. దానిని అనాథాశ్రమంగా మార్చేస్తాను. ఆ ఇంటి విలువ 43 లక్షలు. నాకు ఎవరైనా సాయం చేయాలనుకుంటే చేయండి. లేకపోతే లేదు. అంతకుమించి నేనేమీ చెప్పదలచుకోలేదు’ అని వెల్లడించారు రాకేష్. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2uPQYPy

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....