నితిన్, మందన హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘భీష్మ’ మూవీకి కావాల్సినంత ప్రమోషన్స్ తీసుకువచ్చాయి ఈ మూవీ పోస్టర్స్, సాంగ్స్ ప్రోమోలు. ముఖ్యంగా వాట్టే బ్యూటీ సాంగ్ ప్రోమోతో సినిమాపై హైప్ తీసుకువచ్చారు. మహతి స్వరసాగర్ స్వరపరిచిన సాంగ్ ఎలా ఉందన్న విషయం పక్కనపెట్టేస్తే.. ఇందులో రష్మిక వేసిన స్టెప్పులు.. వెనుక నుండి వాటేసుకునే పోస్టర్‌పై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో చర్చ నడుస్తోంది. మీమ్స్, ట్రోల్స్‌కి లెక్కేలేదు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ పేకప్ సందర్భంగా నితిన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సెట్‌లో చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి గుమ్మడికాయ కొట్టేయగా.. ఈ చిత్ర విజయంపై ధీమాగా ఉన్న నితిన్ ట్విట్టర్‌తో తన ఆనందాన్ని పంచుకున్నారు. భీష్మ మూవీ దర్శకుడు వెంకీ కుడుముల ఐ లవ్ యూ.. నీ గురించి మాటల్లో చెప్పలేను. భీష్మ వంటి సినిమాను నాకు ఇచ్చినందుకు థాంక్స్ అంటూ రష్మిక క్యూటీపై పొగడ్తలు కురిపించారు. ‘రష్మిక నువ్వు నా ఫేవరేట్. నీతో మళ్లీ సినిమా చేసేందుకు ఎక్కువ వెయిట్ చేయలేను’ అంటూ ట్వీట్ వదిలారు. మొత్తానికి నితిన్ ఆనందం చూస్తుంటే త్వరలోనే ఈ ఇద్దరూ కలిసి మరో సినిమాకి ముహూర్తం పెట్టేట్టుగానే కనిపిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36URF73
No comments:
Post a Comment