ఎట్టకేలకు ఓ ఇంటి వాడు కాబోతున్నాడు యంగ్ హీరో నిఖిల్. గత కొన్నాళ్లుగా భీమవరం అమ్మాయి డాక్టర్ పల్లవి వర్మతో ప్రేమలో ఉన్న ఉన్న ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. నిఖిల్-పల్లవిల ప్రేమకు పెద్దల అంగీకారం లభించడంతో గోవాలో శనివారం నాడు (ఫిబ్రవరి 1) పెద్దల సమక్షంలో నిశ్చితార్థం వైభవంగా జరిగింది. గోవాలోనే నిఖిల్ తన లవ్ ప్రపోజ్‌ను డాక్టర్ పల్లవి వర్మకు తెలియజేడంతో తిరిగి అక్కడే నిశ్చితార్థం వేడుకను జరుపుకోవడం విశేషం. ఏప్రిల్ 16న నిఖిల్-పల్లవి వివాహం జరగనుంది. ఇటీవలే తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన నిఖిల్.. కొద్ది రోజుల క్రితం మంచు లక్ష్మి హోస్ట్ చేస్తున్న ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ షోలో నిఖిల్ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. తాను ఒక డాక్టర్ ప్రేమలో ఉన్నట్టు తెలిపారు. ఆమె తనకు చాలా స్పెషల్ అని.. తనను బాగా అర్ధం చేసుకునే మంచి అమ్మాయి అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'హ్యాపీడేస్' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నిఖిల్.. 'స్వామి రారా', 'కార్తికేయ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడ'.. రీసెంట్‌గా 'అర్జున్ సురవరం' లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. నిజానికి 2017లోనే నిఖిల్ వివాహం జరగాల్సి ఉంది. 2017లో హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త ఆంజనేయులు కుమార్తె తేజశ్వినిని నిఖిల్ కు ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు. తేజస్విని.. నిఖిల్‌కు దూరపు చుట్టం కూడా.. దీంతో ఇక వీరి వివాహం పక్కా అని అంతా అనుకున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2017 ఆగస్ట్ 24న నిశ్చితార్ధం జరిపి అక్టోబర్‌లో వివాహ వేడుక నిర్వహించాలని భావించారు. అయితే తరువాత ఈ పెళ్లిని రద్దు చేసుకున్నారు. ముందుగా బంధువులు కావడంతో వధూవరుల జాతకాలు చూపించకుండా పెళ్లి అనుకున్నారు. కానీ జాతకాల దగ్గరకు వచ్చేసరికి ఇద్దరికీ కూడా నప్పకపోవడంతో పరస్పర అంగీకారంతో ఇరు కుటుంబ సభ్యులు పెళ్లిని క్యాన్సిల్ చేసున్నారనే వార్త అప్పట్లో వైరల్ అయ్యింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2GOEEkV
No comments:
Post a Comment