టీవీ యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజుపై షాకింగ్ ఆరోపణలు చేస్తున్నారు ఓ దర్శకుడు. మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన సునిషిత్ అనే దర్శకుడు ప్రదీప్‌పై ఈ ఆరోపణలు చేశారు. అంతేకాదు ఈరోజు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఓసారి ప్రదీప్ ఓ యువతిని వేధించాడని, దాంతో పోలీసులు అతన్ని రెండు రోజుల పాటు జైల్లో పెట్టారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం ప్రదీప్ నటిస్తున్న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ నిబంధనలకు విరుద్ధంగా తెరకెక్కిస్తున్న సినిమా అని అంటున్నారు. వెంటనే ఈ సినిమా షూటింగ్ ఆపి ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ సినిమా దర్శకుడు కూడా నిబంధనలు అతిక్రమిస్తున్నారని పేర్కొన్నారు. గతంలోనూ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు దొరకడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రదీప్ రెండు రోజుల పాటు జైల్లో ఉండటం అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రదీప్ అలాంటివాడు కాదని, ఆయన హీరోగా తొలి సినిమా చేస్తున్నారని, అది చూసి ఓర్వలేక సునిషిత్ ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. READ ALSO: ఇదిలా ఉండగా ప్రదీప్ నటిస్తున్న ‘30రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే పాటను నిన్న సూపర్‌స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో ఈ పాట ట్రెండింగ్ అవుతోంది. ఇందులో అమృత అయ్యర్ ప్రదీప్‌కు జోడీగా నటిస్తున్నారు. పేద కుటుంబానికి చెందిన ఓ యువతీ యువకుడి ప్రేమ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మున్నా సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2GO8t58
No comments:
Post a Comment