‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ లాంటి చక్కటి సినిమాలను ప్రేక్షకులకు అందించారు ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి. అయితే ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం ఇప్పటికీ పడలేదు. అందుకే ఈసారి మెగాస్టార్ వారసుడు వైష్ణవ్ తేజ్‌ను మైండ్‌లో పెట్టుకుని ఓ కథ రాసుకున్నారట. అయితే ‘ఉప్పెన’ సినిమాతో బిజీగా ఉన్న వైష్ణవ్ తేజ్‌కి ముందు జాగ్రత్త కాస్త ఎక్కువే ఉంది. అందుకే ఈ కథను విన్నాక బాగా ఆలోచించి ఓసారి చిరంజీవికి వినిపించాలని నందినీ రెడ్డిని కోరారట. ఇందుకు నందినీ రెడ్డి కూడా ఒప్పుకున్నారట. అయితే ఈ కథను నందినీ రెడ్డి చిరంజీవికి వినిపించగలిగారు కానీ ఆయన్ను మాత్రం నందినీ రెడ్డి కన్విన్స్ చేయలేకపోయారని టాలీవుడ్ వర్గాల సమాచారం. అంతేకాదు కథలో మార్పులు చేయాలని చిరు నందినీని కోరారట. డ్రామా, కామెడీ డోస్ పెంచితే బాగుంటుందని సలహాలు కూడా ఇచ్చారట. ఆయన చెప్పినట్లుగానే నందినీ రెడ్డి స్క్రిప్ట్‌లో మార్పులు చేసి ఆయనకు మళ్లీ ఓసారి కథను వినిపించారట. అయినప్పటికీ చిరు కథతో కన్విన్స్ అవ్వలేదట. దాంతో నందినీ వేరే స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క వైష్ణవ్ తొలి సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. READ ALSO: షూటింగ్ చివరి దశకు చేరుకోవటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తున్నారు చిత్రయూనిట్. ఉప్పెన పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు సుకుమార్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో బుచ్చిబాబు సనా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో నెగెటివ్ రోల్‌లో నటిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. READ ALSO :
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2uWN0Ev
No comments:
Post a Comment