సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. మూడో వారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 6 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. దీంతో మూడు వారాల్లో వసూలు చేసిన మొత్తం షేర్ రూ. 127.35 కోట్లకు చేరింది. ఈ మొత్తంలో తెలుగు రాష్ట్రాల్లో వసూలైందే అధికం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు వారాల్లో రూ.106.5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది ‘సరిలేరు నీకెవ్వరు’. అంతేకాకుండా, ‘బాహుబలి 2’, ‘అల వైకుంఠపురములో’, ‘బాహుబలి’ చిత్రాల తర్వాత అత్యధికంగా షేర్ వసూలు చేసిన నాలుగో చిత్రంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా ఓవర్సీస్‌లో మాత్రం నష్టాలు మూటగట్టుకుంది. ఓవర్సీస్‌లో ఈ చిత్ర డిస్ట్రిబ్యూటర్ రూ.1.50 కోట్ల మేర నష్టపోయారు. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే సినిమా సూపర్ హిట్. Also Read: ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 22 రోజుల్లో ప్రాంతాల వారీగా వసూలు చేసిన షేర్ వివరాలు ఇలా ఉన్నాయి.. నైజాం - రూ. 33.65 కోట్లు సీడెడ్ - రూ. 14.70 కోట్లు ఉత్తరాంధ్ర - రూ. 17.98 కోట్లు గుంటూరు - రూ. 9.63 కోట్లు తూర్పుగోదావరి - రూ. 11.04 కోట్లు పశ్చిమ గోదావరి - రూ. 7.27 కోట్లు కృష్ణా - రూ. 8.35 కోట్లు నెల్లూరు - రూ. 3.86 కోట్లు ఏపీ, టీఎస్ మొత్తం - రూ. 106.48 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ. 9.40 కోట్లు ఓవర్సీస్ - రూ. 11.45 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం షేర్ - రూ.127.33 కోట్లు
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37Upo1M
No comments:
Post a Comment