‘‘నేను నల్లకోటు వేసుకుంటే.. వేసుకోవటానికి పిటీషన్లు, తీసుకోవటానికి బెయిళ్లు ఉండవు’’ అంటున్నారు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తు్న్న చిత్రం ‘లాయర్ సాబ్’. హిందీలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘పింక్’ సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. కొన్ని రోజుల క్రితమే సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి లీకైంది. ఓ వ్యక్తితో ఫైట్ చేస్తూ.. ‘నేను నల్లకోటు వేసుకుంటే.. వేసుకోవటానికి పిటీషన్లు, తీసుకోవటానికి బెయిళ్లు ఉండవు’’ అని డైలాగ్ చెబుతూ కనిపించారు. షూటింగ్ స్పాట్‌లో ఉండే వ్యక్తులే రహస్యంగా రికార్డు చేసి లీక్ చేసేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ పవన్ కళ్యాణ్ నల్ల దుస్తుల్లో నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోలు లీక్ అయ్యాయి. దాంతో సెక్యూరిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడంలేదని పవన్ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఇరవై ఐదు సెకన్ల నిడివి ఉన్న వీడియో కూడా లీక్ అయిపోయింది. మరి ఇది చూశాక పవన్ ఏ స్థాయిలో విరుచుకుపడతారో ఏమో. READ ALSO: ‘ఎంసీఏ’ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. దీంతో పాటు పవన్ మరో రెండు సినిమాలకు సంతకం చేశారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నటించనున్నారు. మరోపక్క ‘గబ్బర్ సింగ్’తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్‌తో పవన్ మరో సినిమా చేయబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. READ ALSO:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37UqhYa
No comments:
Post a Comment