యువ నటుడు నాగశౌర్య, దర్శకుడు వెంకీ కుడుముల మధ్య విభేదాలు ఉన్నాయని ఎప్పటినుంచో ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు ఈ విభేదాల గురించి ఇద్దరూ మాట్లాడలేదు కానీ ఇప్పుడు సందర్భం రావడంతో పెదవి విప్పారు. తనకు, వెంకీ కుడుములకు మధ్య ఏం జరిగిందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘నాకు వెంకీ కుడుములకు ఎలాంటి శత్రుత్వం లేదు. కానీ ‘ఛలో’ రిలీజ్ అయ్యాక వెంకీ నాతో మాట్లాడటం మానేశాడు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేసేవాడు కాదు. నేను ఫోన్ చేస్తున్నానని తెలిసి ఏకంగా నెంబరే మార్చేశాడు. ‘ఛాలో’ సక్సె్స్ అయిందని మా అమ్మ వెంకీకి ఓ ఖరీదైన కారును కూడా గిఫ్ట్‌గా ఇచ్చింది. వెంకీ దానిని కూడా వాడటం మానేశాడు. నేను నటించిన ‘జాదూగాడు’ సినిమాకు వెంకీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ‘ఛలో’ సినిమాకు డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చాను. కానీ ఛలో రిలీజ్ అయ్యాక ఎందుకు వెంకీ నాతో మాట్లాడటం మానేశాడో నాకు ఇప్పటికీ అర్థం కావడంలేదు’’ ‘‘నేను మాత్రం ఛలో క్రెడిట్ మొత్తం వెంకీకే ఇచ్చాను. నేను అతన్ని మా కుటుంబంలో ఒకడిగా భావించాను. ఇక నుంచి వెంకీతో మాట్లాడకూడదని నిర్ణయించేసుకున్నాను. ఒకవేళ అతను మనసు మార్చుకుని మళ్లీ నా దగ్గరికి వచ్చినా అతనితో కలిసి పనిచేయడానికి నేను ఒప్పుకోను. ఇప్పుడు నాకు వెంకీ స్నేహితుడు కూడా కాడు. అతను కనీసం ముఖం చూపించడానికి కూడా ఇష్టపడటం లేదు’ అని వెల్లడించారు నాగశౌర్య. మరి దీని గురించి వెంకీ కుడుముల ఏమని స్పందిస్తారో వేచి చూడాలి. ప్రస్తుతం ఆయన నితిన్‌తో ‘భీష్మ’ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇందులో రష్మిక మందన కథానాయికగా నటిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/397AUHg
No comments:
Post a Comment