2020 సూపర్‌బౌల్ షోలో పాప్‌స్టార్స్ షకీరా, జెన్నిఫర్ లోపేజ్ ఇరగదీశారు. ఈ వయసులోనూ వారిద్దరూ స్టేజ్‌ను గడగడలాడించారు. అంతర్జాతీయ సెలబ్రిటీలు వారిని ప్రశంసలతో ఆకాశానికెత్తేస్తున్నారు. మియామీలోని హార్డ్ రాక్ స్టేడియంలో ఈ సూపర్ బౌల్ షో జరిగింది. ఈ ఈవెంట్‌ను అక్కినేని కోడలు కూడా చూసింది. ‘మేం మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం’ అని కామెంట్ చేశారు. అంతేకాదు జెన్నిఫర్ లోపేజ్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘దమ్ముంటే ఈమెను ఎవరైనా ఆంటీ అని పిలవండి’ అంటూ ఫ్యాన్స్‌కి ఛాలెంజ్ విసిరింది. READ ALSO: అమెరికాలో ఏటా జరిగే ఫుట్‌బాల్ గేమ్‌ని సూపర్ బల్ అంటారు. నిన్ననే ఈవెంట్ ప్రారంభమైంది. షకీరా, జెన్నిఫర్ లోపేజ్ తమ పెర్ఫామెన్స్‌లతో షోను ప్రారంభించారు. ఇక సమంత వర్క్ విషయానికొస్తే ప్రస్తుతం ఆమె ‘జాను’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘96’ సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. శర్వానంద్ కథానాయికగా నటించారు. తమిళ సినిమాను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి నటించారు. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Sc2hcy
No comments:
Post a Comment