‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఆ ఆనందంలో తేలియాడుతున్నారు. సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఆదివారం రాత్రి టాలీవుడ్ డైరెక్టర్లకు గ్రాండ్ పార్టీ ఇచ్చారాయన. ఈ పార్టీలో దిగ్గజ దర్శకుడు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుతో పాటు కొరటాల శివ, సురేందర్ రెడ్డి, విక్రమ్ కె కుమార్, శ్రీను వైట్ల, ఇంద్రగంటి మోహన్‌కృష్ణ, కరుణాకరన్, కళ్యాణ్ కృష్ణ కురసాల, మారుతి ఇలా చాలా మంది దర్శకులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే, బన్నీ 20వ సినిమాకు దర్శకత్వం వహిస్తోన్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. అలాగే బన్నీతో ‘దేశముదురు’, ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ పార్టీలో పాల్గొనలేదు. దీనికి కారణం వాళ్లు వారి ప్రాజెక్టులతో బిజీగా ఉండటమే. సుకుమార్ ప్రస్తుతం బన్నీ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ ‘ఫైటర్’ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. వీళ్లిద్దరూ ఈ పార్టీకి హాజరుకాకపోయినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ, ఒక దర్శకుడి గురించి మాత్రం ఆరా తీస్తున్నారు. ఆయనెవరో కాదు ‘సరిలేరు నీకెవ్వరు’ దర్శకుడు అనిల్ రావిపూడి. Also Read: బన్నీ ఇచ్చిన పార్టీలో అనిల్ రావిపూడి పాల్గొనలేదు. దీంతో ఆయన ఎందుకు పాల్గొనలేదు? బన్నీ ఆయన్ని పిలవలేదా? పిలిచినా ఆయన రాలేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి ‘అల వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల మధ్య విపరీతమైన పోటీ నడిచింది. రికార్డుల విషయంలోనూ ఒకరిని మించి ఒకరు ప్రకటనలు చేశారు. దీంతో ఈ విషయంలో కాస్త యుద్ధ వాతావరణం కనిపించింది. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా తిట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ ఇచ్చిన పార్టీలో మహేష్ బాబు డైరెక్టర్ కనిపించకపోవడం చర్చకు దారితీసింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2uf6FPW
No comments:
Post a Comment