‘శ్రీమంతుడు’ సినిమాలో చిన్న పాత్రలో నటించిన తమిళ నటి ప్రేమ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. తమిళ నటుడు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ దర్శన్‌తో చాలా కాలంగా సనమ్ శెట్టి డేటింగ్‌లో ఉన్నారు. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే బిగ్‌బాస్‌తో కాస్త పాపులారిటీ రాగానే తనను పెళ్లి చేసుకోనని చెప్పి దర్శన్ మోసం చేశాడని సనమ్ పోలీసులను సంప్రదించింది. తనను మానసికంగా టార్చర్ పెట్టాడని పేర్కొంది. దాంతో దర్శన్ కూడా మీడియా ముందుకు వచ్చి అసలు విషయం చెప్పాడు. సనమ్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, నిశ్చితార్థం జరిగిన మాట నిజమే కానీ సనమే తనను మోసం చేసిందని తెలిపాడు. సనమ్ మాజీ ప్రియుడు అజయ్‌తో కలిసి హోటల్‌కు వెళ్లిందని, ఇలాంటి అమ్మాయిని తాను పెళ్లి చేసుకోవాలని అనుకోవడంలేదని తెలిపాడు. దాంతో ఇప్పుడు అజయ్ మీడియా ముందుకు వచ్చాడు. దర్శన్ తనను తప్పుగా అర్థం చేసుకున్నాడని అంటున్నాడు. READ ALSO: ‘‘సనమ్ నేను ఓ పెళ్లిలో కలిశాం. అయితే పెళ్లికి తను కూడా వస్తోందని నాకు తెలీదు. అయితే ఆమె నన్ను పలకరిస్తూ తనకు దర్శన్‌తో నిశ్చితార్థం జరిగిన సంగతి చెప్పింది. త్వరలో అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అంది. అందుకే నేను కూడా సంతోషించా. ఆ తర్వాత సనమ్, నేను పార్టీ కోసం హోటల్‌కు వెళ్లినమాట నిజమే కానీ మాతో పాటు మరో 25 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. దర్శన్ అనుకుంటున్నట్లు మేం ఒంటరిగా హోటల్‌కు వెళ్లలేదు. దయచేసి దర్శన్, సనమ్ ఓసారి మాట్లాడుకుని తమ మధ్య ఉన్న అపోహలు దూరం చేసుకుని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3b7VQjp
No comments:
Post a Comment