Sunday, 2 February 2020

సామాజిక కార్యకర్తతో హీరో రిజిస్టర్ మ్యారేజ్.. వైరల్ పిక్స్

ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. ఖండాంతరాలు దాటుతున్న ప్రేమ కథల్ని మనం చూసే ఉంటాం. కులం, మతం, ఆస్తి, అంతస్తు లాంటివి కొన్ని ప్రేమకథలకు అడ్డుగా తగులుతున్నా.. కొన్ని ప్రేమకథలు ఈ అవరోధాలన్నింటినీ తట్టుకుని తమ ప్రేమకథను పెళ్లి కథతో సుఖాంతం చేసుకుంటున్నారు. కన్నడ నటుడు చేతన్-మేఘ ప్రేమ కథ ఎట్టికేలకు రిజిస్టర్ మ్యారేజ్‌తో సుఖాంతం అయ్యింది. ఆ దినగళ్, రామ్, బిరుగాళి, సూర్యకాంతి తదితర చిత్రాల్లో నటించిన చేతన్ తన ప్రియురాలు, సోషల్ యాక్టివిస్ట్ మేఘను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. బెంగళూరులోని వల్లబ్‌ నికేతన నినోబాభావే ఆశ్రమంలో ఈ యువజంట పెళ్లి కొంతమంది సన్నిహితులు మధ్య నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. శనివారం నాడు గాంధీనగర్‌లోని సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలో వీరి ప్రేమ పెళ్లిన చట్టబద్దంగా రిజిస్టర్‌ చేసుకున్నారు. నటుడిగానే కాకుండా చేతన్ సామాజిక సేవలోనూ ముందు ఉంటున్నారు. తనలాగే విప్లవభావాలు కలిగిన మేఘతో పరిచయం ప్రేమగా మారడంతో ఈ ఇద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. మేఘ లా డిగ్రీ చేస్తూనే వివిధ సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటూ మానవ హక్కుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం మేఘ-చేతన్‌ల పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పలువులు సినీ ప్రముఖులు ఈ నూతన జంటకు విషెష్ అందిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31izO92

No comments:

Post a Comment

'Women In Paatal Lok Rarely Cry'

'No woman is stronger than one who acknowledges her vulnerabilities.' from rediff Top Interviews https://ift.tt/nduI8wb