Friday, 17 January 2020

సారీ ప్రభాస్ ఫ్యాన్స్.. మళ్లీ షూటింగ్ వాయిదా పడిందట

‘సాహో’ సినిమాతో అంచనాలను అందులోకపోయారు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అందుకే తన 20వ సినిమాతోనైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫ్యాన్స్‌కు మళ్లీ ఆ జోష్‌ను కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. నిన్ననే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యిందంటూ ప్రభాస్ తన ఫ్యాన్స్‌కు ఓ అప్‌డేట్ ఇచ్చారు. ఓ పోస్టర్‌ను కూడా అభిమానులతో పంచుకున్నారు. దాంతో ఫ్యాన్స్‌ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. నిన్న షూటింగ్ స్టార్ట్ అయ్యిందో లేదో అప్పుడే మళ్లీ వాయిదా పడిందట. ఈ మేరకు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పూజకు ఒంట్లో బాలేదట. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. దాంతో షూటింగ్ కొన్ని రోజులు వాయిదా వేయాలని టీం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిన్న అన్నపూర్ణ స్టూడియోస్‌తో ఫ్రాన్స్‌ను తలపించేలా భారీ సెట్ వేశారు. కొన్ని రోజులు ఇక్కడ షూటింగ్ జరిపి మిగతా షెడ్యూల్ ఆస్ట్రియాలో తీయాలని అనుకుంటున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. READ ALSO: ‘బాహుబలి’, ‘సాహో’ తర్వాత ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా సినిమాలాగా విడుదల చేయాలని నిర్ణయించుకుంటున్నారట. ఈ సినిమాను తెలుగులోనే కాకుండా తమిళం, హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఫిలిం వర్గాల సమాచారం. ముందుగా సినిమాకు ‘మోన్ అమూర్’ అనే ఫ్రెంచ్ టైటిల్‌ను అనుకున్నారు. ఆ తర్వాత ‘జాన్’ అనే టైటిల్ కూడా ప్రచారమైంది. కానీ దిల్ రాజు తన తదుపరి సినిమాకు ‘జాను’ అనే టైటిల్‌ను పెట్టేశారు. దాంతో ప్రభాస్ సినిమాకు మరో కొత్త టైటిల్‌ను పెట్టే వేటలో ఉన్నార టీం. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NEhwJX

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....