Thursday, 16 January 2020

`డిస్కో రాజా` క్లారిటీ విలన్‌ రోల్స్‌కూ రెడీ

యంగ్ జనరేషన్‌ హీరోలు డిఫరెంట్ సినిమాలతో దూసుకుపోతుంటే సీనియర్‌ హీరోలు మాత్రం ఒక్క సక్సెస్‌ అంటూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే శ్రీకాంత్, జగపతి బాబు లాంటి మీడియం రేంజ్‌ సీనియర్లు హీరో రోల్స్‌కు గుడ్‌బై చెప్పేశారు. వెంకటేష్‌, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవిలు మాత్రం భారీ స్టార్‌ ఇమేజ్‌తో బండి నెట్టుకొచ్చేస్తున్నారు. ఇది లిస్ట్‌లో ఉన్న మరో హీరో . ఇటీవల సక్సెస్‌ల విషయంలో వెనకపడిన రవితేజ, ఈ నెల 24న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. రవితేజ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్‌, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. Also Read: తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లలో పాల్గొన్న రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హీరోగా బిజీగానే ఉన్నా తాను విలన్‌ రోల్స్‌కు కూడా సై అంటున్నాడు. అంతేకాదు గతంలో కూడా తాను ప్రయోగాలు చేశానన్న రవితేజ, కిక్‌, విక్రమార్కుడు లాంటి కమర్షియల్ సినిమాలు చేస్తున్న సమయంలోనే నా ఆటోగ్రాఫ్‌, శంభో శివ శంభో లాంటి డిఫరెంట్‌ మూవీస్‌ కూడా చేశానన్నాడు. అయితే అప్పట్లో ఆ సినిమాలు ఆడలేదని కానీ ఇప్పుడు ఆడియన్స్‌ మైండ్‌ సెట్ మారిందని, కొత్త కథలను, ప్రయోగాత్మక చిత్రాలను ప్రేక్షకులు ఆధరిస్తున్నారని వెల్లడించాడు. Also Read: అందుకే తాను కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌ల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా చెప్పాడు. అంతేకాదు కథలో తన పాత్రకు ఇంపార్టెన్స్‌ ఉంటే విలన్‌ రోల్స్‌ చేయడానికి కూడా తాను రెడీ అంటూ ప్రకటించాడు రవితేజ. కెరీర్‌ స్టార్టింగ్‌లో చాలా సినిమాలో నెగెటివ్‌ రోల్స్‌ చేశాడు రవితేజ, కానీ హీరోగా సెటిల్ అయ్యాక మాత్రం చేయలేదు. ఇన్నేళ్ల తరువాత రవితేజ మళ్లీ నెగెటివ్‌ రోల్స్‌కు సై అనటంతో దర్శకులు ఆ దిశగా ఆలోచన చేస్తారేమో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RoLNxj

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....