Wednesday, 1 January 2020

ముంబైకి మకాం మారుస్తున్న పూరి.. కారణం ఏంటంటే!

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ గురువు బాటలో ముంబైకి మకాం మారుస్తున్నాడు. సెన్సేషనల్ డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన పూరి జగన్నాథ్‌ తరువాత తనదైన స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఒక దశలో వరుసగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేసిన పూరి తరువాత కెరీర్‌లో కాస్త తడబడ్డాడు. వరుస ఫ్లాప్‌లు రావటంతో స్టార్ హీరోలు పూరికి ముఖం చాటేశారు. అయితే ఇటీవల ఇస్మార్ట్‌ శంకర్‌తో తిరిగి ఫాంలోకి వచ్చాడు పూరి. ఈ సినిమా సూపర్‌ హిట్ కావటంతో యంగ్ జనరేషన్‌ హీరోలు పూరితో సినిమా చేసేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. పూరి మాత్రం నెక్ట్స్‌ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే విజయ్‌ దేవరకొండ హీరోగా ఫైటర్‌ సినిమాను ప్రకటించాడు పూరి. Also Read: ఈ సినిమాను పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. విజయ్‌ దేవరకొండకు జాతీయ స్థాయిలో క్రేజ్‌ ఉండటం, పూరికి గతంలో బాలీవుడ్‌లో సినిమా చేసిన అనుభవం ఉండటంతో ఫైటర్‌ను పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా సినిమా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా హిందీ వర్షన్‌ను నిర్మించేందుకు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్‌ జోహార్‌ ముందుకు రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాదు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ ఈ సినిమాలో విజయ్‌కి జోడిగా నటించనుందన్న టాక్‌ వినిపిస్తోంది. వరల్డ్‌ ఫేమస్‌ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. Also Read: ఇలా భారీగా రూపొందుతున్న ఈ సినిమా కోసం పూరి ముంబై నుంచి వర్క్‌ చేయనున్నాడట. పాన్‌ ఇండియా సినిమా కావటంతో ముంబైలో ఆఫీస్‌ ఉంటే కరెక్ట్ అని కరణ్‌ సలహా ఇవ్వటంతో పూరి మకాం ముంబైకి మార్చనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఛార్మీ ముంబై చేరుకోగా త్వరలోనే పూరి కూడా ముంబై వెళ్లనున్నాడని తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MN17T8

No comments:

Post a Comment

Jaya Bachchan: 'I Really Enjoyed Being Wicked'

''There is not a single day in my life when I don't look at Sweta and Abhishek with pride, for being such fine human beings....